పుండు మీద కారం చల్లిన కేంద్రం.. పెరిగిన ఇం‘ధనం’ Petrol price hiked by Rs 2.21 per litre, diesel by Rs 1.79per litre

Petrol price hiked by rs 2 21 per litre diesel to become dearer by rs 1 79 per litre

Demonetisation, Diesel, fuel prices, parliament, Winter session, Petrol, diesel, oil prices hike, global markets, international crude oil

Petrol price has been hiked by Rs 2.21 a litre and diesel by Rs 1.79 per litre, excluding local levies.

పుండు మీద కారం చల్లిన కేంద్రం.. పెరిగిన ఇం‘ధనం’

Posted: 12/17/2016 09:04 AM IST
Petrol price hiked by rs 2 21 per litre diesel to become dearer by rs 1 79 per litre

వాహనదారుల జేబులకు కేంద్ర పెట్రోలియం శాఖ అనుమతితో ఇంధన సంస్థలు చిల్లులు పెట్టాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ అయిల్ ధరల నేపథ్యంలో గత రెండేళ్ల కాలంలో నుంచి నాలుగైదు పర్యాయాలు పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తొలగించి వాహనదారులపై కేంద్ర కరుణ చూపుతుందని భావించిన తరుణంలో కేంద్రం వాహనదారులకు షాక్ ఇస్తూ.. పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.21, లీటర్‌ డీజిల్‌ ధర రూ.1.79 పెరిగింది. స్థానిక పన్నులతో కలిపి ఈ పెంపు మరికొంత ఎక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

వాస్తవానికి ధరల పెంపు ప్రకటన గురువారమే వెలువడాల్సి ఉన్నా.. పార్లమెంటు సమావేశాలలలో ఇప్పటికే ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్న ప్రతిపక్షాలు ఇంధన ధరల పెంపుపై కూడా పార్లమెంటు సమావేశాల చివరి రోజున అట్టుడికించే అవకాశాలు వున్నాయని, దీంతో తాత్కాలికంగా వాయిదా వేసుకున్న కేంద్రం క్రితం రోజు రాత్రి ప్రకటించింది. పార్లమెంటు సమావేశాలు ముగిసి ముగియగానే చమురు సంస్థలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. స్థానిక పన్నులతో కలిపి ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.2.84, లీటర్‌ డీజిల్‌ రూ.2.11 పెరిగి వరుసగా రూ.68.94, రూ.56.68కి చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  diesel  oil prices hike  global markets  international crude oil  fuel  

Other Articles