మోదీ జీ.. మీరు 150 ఏళ్ళు బతకాలి!! | Asaddudin Owaisi satire on PM Modi.

Owaisi fire on modi over demonetisation

Asaduddin Owaisi, PM Modi, Owaisi on Demonitization, Asaduddin Owaisi latest speech, Owaisi Modi, Assaduddin Owaisi Narendra Modi, narendra modi owaisi, Owaisi Tyrant comments on Modi

Asaduddin Owaisi targets PM Modi on Demonitization, says like every Prime Minister you will also go one day.

మోదీజీ.. ఏదో రోజు మీ పని అంతే...!

Posted: 12/12/2016 05:40 PM IST
Owaisi fire on modi over demonetisation

నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా ప్రవర్తించాడంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యాడు. మిలాదున్ నబీ సందర్భంగా ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. మోదీ తన అహాన్ని సంతృప్తిపరచుకునేందుకు దేశంలోని ప్రతి ఇంటినీ ఇబ్బందుల్లోకి నెట్టారని, ఒక్క నిర్ణయంతో ప్రజల జీవన శైలిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు.. వెళ్లారు. మోదీజీ మీరూ కూడా ఏదో రోజు దిగిపోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించాడు.

ఇవాళ బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిల్చున్న వారే రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల ముందు నిల్చుని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. 15 లక్షల ఖరీదైన సూట్ వేసుకుంటూ, అత్యంత ఖరీదైన షాల్ వేసుకునే వ్యక్తి తనను తాను ఫకీరు అంటారు...మరి ఏ రకమైన ఫకీరో ఆయనకే తెలియాలి' అంటూ ఎద్దేవా చేశాడు. 'మీరు ఫకీరు కాదు నియంత' అని ఆయన ఆవేశంగా అన్నారు. 50 రోజులు బాధలు ఓర్చుకోండి అని చెబుతున్న ఆయన 120 మంది వరకు మరణించినా ఎలాంటి పశ్చాత్తాపం కనబరచడం లేదని మండిపడ్డారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ పడిపోతుందని, 4 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఆయన పీఎం సాబ్ కి అవేంపట్టడం లేదా? అంటూ ప్రశ్నించాడు.

నిర్ణయం వెలువడిన నవంబర్ 8 నుంచి నవంబర్ 30 వరకు 12.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని, ఆ మొత్తం నల్లధనమేనా? అని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 15 నుంచి 30 మధ్య 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, ఈ మొత్తం ఎవరిదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదని, ఒకసారి నవ్వుతారని, మరోసారి ఏడుస్తారని, ఇంకోసారి తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటారని ఆయన అన్నారు. తాము మాత్రం అయనను 150 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra modi  MIM Asaduddin Owaisi  Demonetization  

Other Articles