చెన్నైలో వార్థా భీభత్సం.. ఏపీలో వణుకు మొదలైంది | Vardah reached chennai and destroyed city.

Cyclone vardah effect starts in chennai

Cyclone Vardah, Vardah Cyclone, 15 NDRF Cyclone Vardah, Chennai Vardah, Andhra Pradesh Vardah, Vardah reached chennai, Coastal Area Vardah warn, Heavy winds Vardah

Cyclone Vardah reached, 15 NDRF teams deployed in Tamil Nadu, Andhra Pradesh.

ITEMVIDEOS:వార్థా దెబ్బకి చెన్నై విలవిల.. ఏపీలోనూ వర్ష భీభత్సం

Posted: 12/12/2016 03:11 PM IST
Cyclone vardah effect starts in chennai

ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా వార్థా చెన్నైని అతలాకుతలం చేస్తోంది. సాయంత్రం 5 గంటలకు తన ప్రభావం చూపుతుందని భావించిన ఈ పెనుతుఫాన్ ముందగానే చేరిపోయింది. సముద్రంలో పెద్ద ఎత్తున్న అలలతో అల్లకల్లోలం, గంటకు 120 మైళ్ల వేగంతో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలగొరగడ, రోడ్లపైకి చేరిన నీరు అక్కడి పరిస్థితి కేవలం రెండే రెండు గంటల్లో దారుణంగా మారిపోయింది.

ఉదయం నుంచి రంగంలోకి దిగిన 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పదిే వేల మందికి పైగా తరలించగా, ప్రస్తుతం ఇంకొందరిని సురక్షిత ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఉంది. తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉన్న వార్దా అతితీవ్ర‌ తుపాను ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం మ‌రింత‌ అప్రమత్తమైంది.

ఇతర రాష్ట్రాల నుంచి చెన్నైకి రావాల్సిన రైళ్లను ఇప్పటికే రద్దు చేయగా, విమాన సర్వీసులను హైదరాబాద్, బెంగళూర్ కి మళ్లీస్తున్నారు. రోడ్డు మార్గాల గుండా కూడా రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, చెట్లు, స్తంభాల వద్ద నించోకూడదని తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది. చెన్నైలోనికల్పకం అణఉ విద్యుత్ కేంద్రం వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు. 700 మంది సైనికు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 

బ‌ల‌మైన ఈదురుగాలుల‌తో కూడిన‌ భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, మొబైల్ కమ్యూనికేషన్ కూడా దెబ్బతింది. తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డానికి ఆహార పొట్లాల‌ను ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉంచుకుంది. మరోవైపు అమ్మ క్యాంటీన్ల ద్వారా సాయం చేసేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు నడుం బిగించారు. రానున్న గంటలో ఈ గాలుల తీవ్రత 150 కి చేరే అవకాశం ఉందని హెచ్చరించటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఏపీ పై ఎలా ఉంది? 
వార్ధా తుపాను ప్రభావం ఏపీపైన నెమ్మదిగా ప్రారంభం అయ్యింది. మున్ముందు ఇది మరింత ముదిరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్న‌ట్లు రైల్వే శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి చెన్నయ్ వెళుతున్న ప‌లు రైళ్లను రద్దు చేసిన‌ట్లు, ప్రధాన రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది. ప్రయాణికులు రైళ్ల రాక‌పోక‌ల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్ర‌దించవ‌చ్చ‌ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంత ప్ర‌జ‌ల‌యినా 0866-248800 నెంబ‌రుకి ఫోను చేసి రైళ్ల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపింది. విజయవాడ, నెల్లూరు, గూడూరులో ప్ర‌త్యేకంగా హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొంది.

విజ‌య‌వాడ‌-0866 2575038, 1072, నెల్లూరు- 0861 2345864, 7702774104, గూడూరు- 9604506841 హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai vardah  Andhra Pradesh  

Other Articles