మోదీ ఆ రాష్ట్రంలో మిలిటరీ పాలన విధించాడా? | Mamata protests presence of Armymen at toll plaza.

Mamata refuses to leave office over army at toll booths

West Bengal CM, CM Mamata Banerjee, Demonetization, military coup West Bengal, Army at toll gates, Army at toll gates Mamata Benarjee, Mamata Banerjee compare Modi, Mamata Banerjee compare Military rule, Toll gates Army

Mamata Banerjee compares situation in Bengal to 'military coup' over Army at toll gates.

అనుమతి లేకుండా ఆర్మీని అలా ఎలా దించారు?

Posted: 12/02/2016 09:24 AM IST
Mamata refuses to leave office over army at toll booths

మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దానిని మరింత తీవ్ర తరం చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తీవ్రంగా నిరసిస్తోంది. వారిని ఉపసంహరించుకుంటేనే తాను కార్యాలయం నుంచి కదలుతానని భీష్మించుకుని గురువారం రాత్రి అంతా అక్కడే కూర్చుంది.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని నియమించడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. "ఇది సైనిక తిరుగుబాటా?" అని ప్రశ్నించిన ఆమె, సైన్యం మాక్ డ్రిల్ చేయాలని భావించినా, రాష్ట్రం అనుమతి తప్పనిసరని అన్నారు. సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని సచివాలయంలోని తన కార్యాలయంలో ఆమె రాత్రి నుంచి బైఠాయించారు. సామాన్యులకు తాను జవాబుదారీగా ఉన్నానని, రాత్రంతా తాను ఆఫీసులోనే ఉండి పరిస్థితిని చూస్తానని చెప్పిన ఆమె అన్నంత పనీ చేశారు.

ఆమె కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే హుగ్లీ బ్రిడ్జ్ టోల్ బూత్ ఉంది. అక్కడా సైన్యం కాపలాకు దిగింది. అర్ధరాత్రి తరువాత హుగ్లీ బ్రిడ్జ్ నుంచి సైన్యం వెళ్లిపోయినా... మమత కదల్లేదు. ఇంకా 18 రాష్ట్రాల్లోని టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై మీడియాలో కథనాల ద్వారానే మమతా సమాచారం తెలుసుకోవటం విశేషం.

కాగా, టోల్ బూత్ ల వద్ద డబ్బులు చెల్లించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో, ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, సంబంధిత పోలీసులకు సమాచారం అందించాకే తాము రంగంలోకి దిగామని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశాడు. అసోంలోని 18 ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 13 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో 6, నాగాలాండ్‌లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజొరాంలలో ఒక్కో ప్రాంతంలో  ఇలా బలగాలను మోహరించినట్లు చెబుతున్నారు. కాగా, మొత్తం ఆర్మీని ఉపసంహరిస్తేనే తాను ఆందోళన విరమిస్తానని మమత అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  CM Mamata Benarjee  Army toll gates  Protest  

Other Articles