రన్నింగ్ విమానం నుంచి అమాంతం దూకేసింది... | Woman jumps out of taxiing United flight on to the tarmac .

Woman jumps out of taxiing united flight

Houston airport, Woman Jumps Land Plane, United flight, United flight woman jump, Landing flight woman jump, Woman jumps out, Houston airport police arrest

Lady opens emergency exit and jumps out of taxiing United flight on to the tarmac after landing at Houston airport.

ITEMVIDEOS:ల్యాండింగ్ విమానం నుంచి అమాంతం దూకేసింది

Posted: 11/29/2016 01:31 PM IST
Woman jumps out of taxiing united flight

విమానం రన్ వే దిగబోతుంది. మరికాసేపట్లో ఎలాగూ దిగాల్సిందే కదా!. అయినా ఓ మహిళ ఆపుకోలేకపోయింది. ల్యాండ్ అవుతుండగానే ఎమర్జెన్సీ ద్వారం తెరుచుకుని మరీ కిందకు దూకేసింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో కలకలం రేగగా, పైలెట్ అప్రమత్తతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అమెరికాలోని టెక్సాస్ లో ఘటన చోటుచేసుకుంది.

న్యూ ఓర్లిన్స్ నుంచి హ్యూస్టన్ రావాల్సిన యూనైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ ద్వారం తెరిచి, 15 అడుగుల ఎత్తు నుంచి ఆమె దూకేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతంర ఎఫ్ బీఐ కూడా ఆ యువతిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఘటనలో ఆ మహిళతో పాటు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. జరిగిన ఘటనతో తాము షాక్ కు గుయ్యామని తోటి ప్రయాణికులు చెప్పారు. కిందకు దూకిన మహిళ విమాన సిబ్బందితో కాని, తోటి ప్రయాణికులతో కాని ఏమీ మాట్లాడలేదని... ఎమర్జెన్సీ ద్వారం ఓపెన్ చేసి, దూకేసిందని తెలిపారు. పక్కనే కూర్చున్న ఓ యువకుడు యువతి దూకేసిన తర్వాత డోర్ తెరిచి ఉన్న ఓ వీడియోను నెట్ లో పోస్ట్ చేశాడు. ఆ యువతి ఎందుకలా చేసిందన్న దానిపై స్పష్టత ఇంకా లభించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman jumps out  United flight  Houston airport  Arrest  

Other Articles

Today on Telugu Wishesh