కుప్పకూలిన విమానం.. పెను విషాదంలో బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు Plane Crashes On The Way To Colombia From Bolivia, Carrying Brazilian Football Team

Plane crashes on the way to colombia from bolivia carrying brazilian football team

Chapecoense, Brazil football, sudamerica, Medellin's international airport, plane crash, local soccer club, Colombia, Bolivia, Brazilian Football Team, Brazil

A plane carrying members of a local soccer club, Chapecoense, from Brazil has crashed on its way to Medellin's international airport.

కుప్పకూలిన విమానం.. పెను విషాదంలో బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు

Posted: 11/29/2016 01:00 PM IST
Plane crashes on the way to colombia from bolivia carrying brazilian football team

కొలంబియాలో ఘోరం సంభవించింది. బొలివియా నుంచి మెడిల్లిన్ అంతర్జాతీయ విమనాశ్రయానికి చేరుకోవాల్సిన విమానం మార్గమధ్యంలో కుప్పకూలింది. విమానం కుప్పకూలిన ఘటనతో బ్రెజిల్‌లో పెను విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రెజిల్ కు చెందిన 72 మంది ఫుట్‌ బాల్‌ క్రీడాకారులను తీసుకెళుతున్న విమానం కుప్పకూలిపోవడంతో బ్రెజిల్ లో విషాదంలో మునిగింది. మొత్తం 81మందితో వెళుతున్న సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని మెడిల్లిన్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

చాపెకోఎన్సో ఫుట్‌ బాల్‌ క్లబ్బుకు చెందిన ఫుట్‌ బాల్ క్రీడాకారులతో పాటు విమాన సిబ్బంది తో కలసి విమానంలో మొత్తం 81 మంది వున్నారని అధికారులు తెలిపారు. వీరంతా కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్లో పాల్గొనేందుకు వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. బ్రెజిల్‌ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తరువాత ఈ విషాదం సంభవించింది.

అయితే విమానం కూలిపోడానికి ఇంధనం లేకపోవడమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తేల్చారు.బొలివియా నుంచి బయలు దేరిన ఈ విమానం కొలంబియా చేరుకునే సమయంలోనే రాడార్‌నుంచి నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది నగరం శివారు ప్రాంతాల్లోని పెద్ద పర్వాతాల్లో కూలిపోయినట్లు గుర్తించినట్లు మెడిల్లిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. ఈ ఘటనలో పలువురు క్రీడాకారులు మృత్యుంజయులుగా బయటపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తీవ్రంగా గాయపడిన వీరిని అస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. వీరు ఎలా భయటపడ్డారన్నది మాత్రం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chapecoense  Brazil football  sudamerica  Bolivia  plane crash  Colombia  Brazil  

Other Articles