సరికొత్త యాప్ : ఏటీఎం క్యూ లో మీ బదులు మరొకరు...| Hire Hourly Helpers @ Rs 90 per hour

Someone s willing to queue up for you

Bookmychotu, Hire Hourly Helpers, Men for queue at Banks, Bookmychotu app, Satjeet Singh Bedi and Govin Kandhari, ATM queue, Indian Banks Rush, Bank Rush, ATM rush, ATM money

A start-up in New Delhi is mining what seems to be a very palpable need. It provides people who can queue up for you – at the ATM, bank and so on – for Rs 90 per hour. The service is available in Delhi and the National Capital Region. Bookmychotu, founded by Satjeet Singh Bedi and Govin Kandhari in January this year, claims to be the country’s “first on-demand helper booking website”. And, it burst out of relative anonymity after it started running a campaign on social media last week, within days of the government’s demonetisation move.

డబ్బులు కావాలా? గంటకు 90 రూ. ఇస్తే చాలూ...

Posted: 11/23/2016 07:38 AM IST
Someone s willing to queue up for you

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో యాప్ ల ప్రపంచంతో ఏం కావాలన్న క్షణంలో ప్రతీ వస్తువు మన వద్దకే చేరిపోతుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు నాణ్యమైన సేవలను వారి వద్దకే చేరవేస్తూ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కంపెనీ ఇచ్చిన బంఫరాఫర్ యూపీ, ఢిల్లీ ప్రాంతంలో జనాలు చక్కగా వినియోగించుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతకీ అంతటి హాట్ హాట్ సర్వీస్ ఏంటనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.

ప్రస్తుతం ప్రజలంతా బ్యాంకులు, ఏటీఏంల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారు. డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు, పాత నోట్లను మార్చుకునేందుకు నానా కష్టలు పడుతున్నారు. గంటల త‌ర‌బ‌డి క్యూల‌లో నిల్చోవ‌డం వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతోంద‌ని చాలామంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటువంటి క‌ష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చింది బుక్‌మైచోటు డాట్ కామ్ అనే స్టార్ట‌ప్ కంపెనీ. పేరు చోటు ఉంది కదా అనుకోకండి. అలాగని ఇది చిన్న పిల్లలను పంపించదండోయ్.. ఖచ్ఛితంగా 18 ఏళ్లకు పైబడిన వారినే పంపిస్తుంది. ఇందుకోసం గంట‌కు రూ.90 చెల్లిస్తే చాలూ మీ త‌ర‌పున క్యూలో నిల్చునేందుకు ఓ వ్య‌క్తిని పంపిస్తామంటూ ప్ర‌క‌టించింది.

బ్యాంకులు, ఏటీఎం క్యూల‌లో నిల్చునేందుకు బుక్ చేసుకున్న వారు చివ‌రి నిమిషంలో త‌ప్ప‌కుండా బ్యాంకు, ఏటీఎం వ‌ద్ద‌కు రావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. తాము పంపిన వ్యక్తులు కేవ‌లం లైన్లో మాత్ర‌మే నిల్చుంటార‌ని పేర్కొంది. స‌త్‌జీత్ సింగ్ బేడీ, గోవిన్ కందారి అనే ఇద్ద‌రు వ్యక్తులకు వచ్చిన ఆలోచనే ఇది. ప్ర‌జ‌ల క్యూ క‌ష్టాల‌ను తీర్చేందుకు వినూత్న ఆలోచ‌న‌ చేసామని వారు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికైతే బుక్‌మై చోటు సేవ‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌రియాణా, ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాను రాను సేవలను మరింత విస్తరిస్తామని వారు చెబుతున్నారు.

ఇంతకీ బుక్‌మై చోటులో హెల్ప‌ర్‌ను బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్ కావాల్సి ఉంటుంది. లేదా +91-8587028869 అనే నంబ‌రుకు కాల్ చేయాల్సి ఉంటుంది. అన్నట్లు ఈ సేవ‌లు ఒక్క క్యూలైన్ల‌కే ప‌రిమితం కాదు.. ఇల్లు మార‌డం ద‌గ్గ‌రి నుంచి ఇంటికి స‌రుకులు తెచ్చివ్వ‌డం వ‌ర‌కు అన్నింటికీ ఈ సైట్ ద్వారా హెల్ప‌ర్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bookmychotu app  helpers  banks and ATM  Money  

Other Articles