ఉత్తర్ ప్రదేశ్ రైలు ప్రమాదం 133కు చేరిన మృతుల సంఖ్య.. Kanpur train tragedy: Death toll rises to 133

Kanpur train tragedy death toll rises to 133

Kanpur train accident live, Kanpur train accident, Kanpur train derailment, Patna-Indore train accident, Patna Indore Express, Northern Central Railway, Patna-Indore, Major train accidents in India, Patna-Indore death toll, Railway helpline, Kanpur, TrainTragedy, 100 people died, Patna- Indore Express, Suresh Prabhu, train derailment

At least 133 people were killed and more than 200 injured when an Indian express train derailed in northern state of Uttar Pradesh on Sunday, with the toll set to rise

ఉత్తర్ ప్రదేశ్ రైలు ప్రమాదం 133కు చేరిన మృతుల సంఖ్య

Posted: 11/21/2016 11:23 AM IST
Kanpur train tragedy death toll rises to 133

ఉత్తరప్రదేశ్‌లోని పుక్రాయ వద్ద ఇండోర్ పాట్న ఎక్స్ ప్రెస్ రైలుకు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 133కు చేరింది. క్రితం రోజు తెల్లవారు జామున రైలు పట్టాలు తప్పడంతో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగుతూ 133కు చేరుకుంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారిలో ఇంకా సగానికి పైగా ప్రయాణికుల పరిస్థితి విషమంగానే వుందని వైద్యాధికారులు చెబుతున్నారు.

జనరల్ బోగీతో , A1, B1, B2, B3, BE, S1, S2, S3, S4, S5, S6, లగేజ్ ర్యాక్ బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగడంతో ప్రమాదలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు చెబతున్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.అధికంగా వుందని అధికారులు తెలపుతున్నారు.

యూపీ పోలీసులు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. దీంతో మృతులకు గుర్తించడం కష్టంగా మారింది. ఇంకా కొంత మంది బోగీల కింద చిక్కుపోయారు. వీరిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారు సమీపంలోని పట్టణాలకు వెళ్లి బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  TrainTragedy  100 people died  Patna- Indore Express  Suresh Prabhu  train derailment  

Other Articles