118కి చేరిన రైలు ప్రమాద సంఖ్య.. ప్రధాని మోడీ విచారం Anguished on the loss of lives, tweets PM Modi

Pm modi announces ex gratia of rs 2 lakh for victims kin

kanpur, patna indore train, train accident, PM Modi, ex-gratia, suresh prabhu, railway minister, train accident deaths, kanpur train accident, indore express train accident, suresh prabhu railway minister, Kanpur, TrainTragedy, 100 people died, Patna- Indore Express, Suresh Prabhu, train derailment

PM Modi announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister's National Relief Fund (PMNRF) for the next of kin of those killed in the train tragedy that took place near Kanpur

118కి చేరిన రైలు ప్రమాద సంఖ్య.. ప్రధాని మోడీ విచారం

Posted: 11/20/2016 11:14 AM IST
Pm modi announces ex gratia of rs 2 lakh for victims kin

ఉత్తరప్రదేశ్ లో ఈ తెల్లవారుజామున పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. తొలుత 95 మంది మరణించారన్న వార్తలు రాగా, క్రమంగా ఆ సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఈ దుర్ఘటనలో 118 మందికి పైగా మరణించారని సమాచారం. కాగా ఈ ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని... బాధతో మాటలు కూడా రావడం లేదని ట్వీట్ చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్ ప్రభుతో ఆయన మాట్లాడారు, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో 45 మంది చనిపోగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ తెలిపారు. బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  TrainTragedy  120 dead  Patna- Indore Express  PM Modi  ex-gratia  Suresh Prabhu  train derailment  

Other Articles