తప్పతాగిన యువతి.. రాళ్లు రువ్వి, చెంప కొరికి, గొంతు నులిమి రచ్చ. రచ్చ... | Drunk woman creates ruckus

Drunk woman creates ruckus in hyderabad

Hyderabad Necklace Road, Drunk woman, Hyderabad Drunk woman, Drunk woman in Hyderabad, Hyderabad Drunk Woman Arrest

Drunk woman creates ruckus in Hyderabad Necklace Road.

తప్పతాగి మరీ సినిమా చూపించింది

Posted: 11/15/2016 09:31 AM IST
Drunk woman creates ruckus in hyderabad

మద్యం మగువల హల్‌చల్ తారాస్థాయికి చేరుకుంది. హైదరాబాద్ లో సోమవారం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఫుల్లుగా తాగిన ఓ యువతి నడిరోడ్డుపైకి చేరి జనాలకు సినిమా చూపించింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్లు రువ్వింది. మరో మహిళ చెంప కొరికి, గొంతు నులిమి గాయపరిచింది.

నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోగా, జనాలు చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తప్పతాగిన ఓ యువతి రహదారికి అడ్డంగా నిలబడి, వాహనదారులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాహనాలపైకి రాళ్లు విసరడంతో కొన్ని వాహనాల అద్దాలు భళ్లుమన్నాయి. ఆ పక్కనే రోడ్డుపై తినుబండారాలు విక్రయించే ఓ మహిళ వద్దకు వెళ్లి జట్టుపట్టుకు లాగింది. ఆపై గొంతు నులిమింది. అక్కడితో ఆగక చెంపను కొరికి తీవ్రంగా గాయపరిచింది.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరిని తిట్టిపోసింది. ఆమె చర్యలను జనం సినిమాలా తిలకించారు. కొందరు పోలీసులు సమాచారం అందించడంతో వారు వచ్చి యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో యువతిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మత్తు దిగే వరకు అక్కడే ఉంచారు. కాస్త పలుకుబడి ఉన్న అమ్మాయి కావటంతో మందలించి, మళ్లీ రావాలంటూ ఆదేశించి పంపించేశారంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk woman  Hyderabad  Necklace Road  Rucks  Arrest  

Other Articles