నోట్ల విషయంపై నోరు మెదిపిన అమీర్.. మోదీకే సలహా ఇస్తున్న కుర్రహీరోయిన్ | Aamir Khan on demonetisation

Dangal hero aamir khan on demonetisation

Aamir Khan, Aamir Khan on national interest, Aamir Khan Dangal, Aamir Khan Modi's demonetisation, Aamir Khan Modi, Pooja Hegde Modi, Pooja Hegde Demonetisation

Aamir Khan on Modi's demonetisation move. Focus on national interest, ignore short-term impact.

నా సినిమా ఏమైపోయినా ఫర్వాలేదు

Posted: 11/12/2016 04:19 PM IST
Dangal hero aamir khan on demonetisation

పెద్దనోట్ల రద్దు ప్రభావం సినిమాలపై ముఖ్యంగా టాప్ హీరోలపై ఉంటుందన్న విషయం తెలిసిందే. అయినా ఈ విషయంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు మోదీ తీసుకున్న నిర్ణయంపై అభినందనలు కురిపించారు. తాజాగా, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

‘రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. నా సినిమాలపై ప్రభావం చూపినా ఫర్వాలేదు కానీ, సామాన్య ప్రజలకు మాత్రం మేలు జరగాలి’ అన్నాడు అమీర్. పెద్దనోట్లు రద్దు కారణంగా ఆ నోట్ల మార్పిడి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమేనని చెప్పాడు. క్రిస్మస్ కి దంగల్ రిలీజ్ కానుంది. మల్లయోధుడు మహావీర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుందే ఈ సినిమా. గతంలో అసహనం వ్యాఖ్యలు చేయటం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న అమీర్. దాని తీవ్రతను తగ్గించేందుకే ఈ వ్యాఖ్యలు చేసుంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మోదీకి ఓ సలహా...

Pooja Hegde Advise Modi

ఇక పెద్ద నోట్లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయంతో ఎక్కడెక్కడో ఉన్న బ్లాక్ మనీ బయటకు రావాలన్నదే మోదీ ఆలోచన. కానీ, ఆ డబ్బును కొందరు పడేయడం, తగలబెట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి హీరోయిన్ పూజా హెగ్డే ఓ సూచన చేసింది.

వచ్చే ఏడాది మార్చి వరకు రూ. 500, రూ. 1000 నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించాలని సూచించింది. దీని వల్ల ఓ మంచి కార్యక్రమానికి బ్లాక్ మనీ ఉపయోగపడినట్టు అవుతుందని చెప్పింది. అనవసరంగా డబ్బును నాశనం చేయడం కంటే... నల్లధనం కలిగినవారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆ డబ్బును డొనేట్ చేస్తే బాగుంటుందని సూచిస్తూ ట్వీట్ చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  PM Modi  Demonetisation  Pooja Hegde  

Other Articles