రోడ్డుపై వెయ్యి నోట్లు.. ఏరుకునేందుకు పోటీపడ్డ స్థానికులు Rs 1000 notes on road, locals compete to collect

Rs 1000 notes on road locals compete to collect

Rs 1000, dwaraka tirumala, west godavari, 1000 currency notes on road, andhra pradesh, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, Rs 500,500 rupees note,1000 Rs Note,Rs 2000 new note, BJP alerted its friends on notes, Demonitization,BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Man throws away Rs 1000 notes from a speeding car, locals watched notes on road and compete each other to collect them

రోడ్డుపై వెయ్యి నోట్లు.. ఏరుకునేందుకు పోటీపడ్డ స్థానికులు

Posted: 11/12/2016 04:12 PM IST
Rs 1000 notes on road locals compete to collect

మనదగ్గర కూడా జరిగిందోచ్..! అదేంటి మన దగ్గర కూడా జరగడమేంటని అలోచిస్తున్నారా..? కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ పెద్ద నోట్లపై వేటు వేసిన తరువాత కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తన వద్దనున్న నల్లడబ్బును తన నియోజకవర్గంలోని ఓటర్లుకు పంచిన కథనాలు, ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పారిశ్రమ కార్మికులు నోట్లను తగులబెట్టిన వైనం, ఇలా పలు రాష్ట్రాల్లో పలు ఘటనలు చోటుచేసుకున్న సందర్భంగా మన వద్ద కూడా ఓ అలాంటి ఘటనే జరగడం చర్చనీయాంశంగా మారింది.

అదో పవిత్ర పుణ్యక్షేత్రం.. చిన్న తిరుపతిగా భాశించి భక్తులు నిత్యం అక్కడికి పెద్ద సంఖ్యలోనే వస్తూవుంటారు. వచ్చి పోయే యాత్రికుల సందడితో నిత్యం బిజీగా వుండే ఆ రోడ్డుపై వెయ్యి రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. ఏవో కాయితాలు అని ముందుగా భావించిన స్థానికులు.. తరువాత వాటిని పరిశీలించగా, అవి అన్ని వెయ్యి రూపాయల నోట్లు. తాజాగా ప్రభుత్వం రద్దు చేసిన నోట్లను మార్చుకునేందుకు వీలున్న.. వాటిని రోడ్డుపై పడేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
 
ద్వారకాతిరుమలలోని ఎస్‌వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 1000  dwaraka tirumala  west godavari  1000 currency notes on road  andhra pradesh  

Other Articles