పాత నోట్లతో గాల్లో ప్రాణాలు.. | Huge line kills while change old currency.

Huge line kills while change old currency

Currency deaths, Demonetisation effect kills, Huge line at banks, New Currency Troubles, Theaters new currency, One man in theater, Gujarat theater,

Demonetisation effect kills people who Que for exchange old notes.

పాతనోట్లతో ప్రాణాలు పోతున్నాయ్...

Posted: 11/12/2016 08:08 AM IST
Huge line kills while change old currency

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు చిల్ల‌ర క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. 500, 1000 రూపాయ‌ల నోట్లను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఆందోళ‌న ప‌డుతున్న జ‌నాలు బ్యాంకు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేయటం, పరిమితి డ్రా ఉండటంతో త్వరత్వరగా డబ్బులు తీసేసుకోవాలన్న ఆత్రుతతో ఎగబడిపోతున్నారు. మరోపక్క ఎన్నో ఏటీఎం సెంట‌ర్లు ఇంకా తెర‌చుకోలేదు. ప‌లు ఏటీఎం కేంద్రాల్లో నాట్ వర్కింగ్, నో సర్వీస్ అని బోర్డులు క‌నిపిస్తున్నాయి.

ఈ క్రమంలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక్క కేరళలోనే నిన్న ఇద్దరు మరణించగా, గుజరాత్ లో ఒకరు, ఒడిశాలో మరోకరు చనిపోయినట్లు సమాచారం. కేరళ రాజధాని తిరువనంతపురంకి 158 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలపుజ్జాలో ఓ వృద్ధుడు బ్యాంకు వద్ద 45 నిమిషాలు నిలబడి అలాగే కుప్పకూలిపోగా, మరో ఘటనలో తలాస్సెరిలో మరో వ్యక్తి బ్యాంకు రెండో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా తోసేశారా? అన్నది తెలియాల్సి ఉంది. అతని దగ్గర 5 లక్షల విలువైన డబ్బును పోలీసులు గుర్తించారు.

ఇక మిగిలిన ఘటనల్లో ఒడిషాలో 16 ఏళ్ళ యువకుడు క్యూలో తొక్కిసలాట కాగా ఊపిరాడకుండా చనిపోగా, గుజరాత్ లో ఓ 35 ఏళ్ల మహిళ లైన్ లోనే గుండెపోటుతో చనిపోయింది. అయితే సరిపడా డబ్బులు ఉన్నాయని, ప్రజలు దయచేసి ఇలా ఎగబడి ప్రాణాలు పొగొట్టుకోకండని ప్రభుత్వం విజ్నప్తి చేస్తోంది. అంతేకాదు ప్రజల ఇక్కట్లను తగ్గించడంలో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది. నేటి మధ్యాహ్నం వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ రద్దు నిర్ణయం ఈ నెల 14 వరకు వర్తిస్తుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇదే తరహాలో 500, 1000 రూపాయల నోట్లు ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, రైల్వే కౌంటర్లు, విమానాశ్రయాల్లో మరో మూడు రోజుల పాటు చెల్లుతాయని, అక్కడ పాత నోట్లను స్వీకరిస్తారని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 14 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

సినిమాలకు పెద్ద దెబ్బ:
500, 1000 రూపాయల నోట్ల ఆకస్మిక రద్దు నిర్ణయం సినీ పరిశ్రమపై భారీగానే పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కొన్ని సినిమాలను శుక్రవారం రోజే విడుదల చేశారు. అయితే ప్రేక్షకుల వద్ద పెద్ద నోట్ల సమస్య తలెత్తడంతో సినిమాలు చూసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో దేశంలోని పలు ప్రముఖ పట్టణాల్లో సినిమాలు చూసేందుకు ఎవరూ ధియేటర్లకు వెళ్లలేదు. అహ్మదాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూసేందుకు కేవలం ఒక్కడంటే ఒక్కడు మాత్రమే వెళ్లాడు. అయితే బాధ్యత ప్రకారం షోను రద్దు చేయకుండా అతని కోసం థియేటర్ యాజమాన్యం సినిమాను ప్రదర్శించింది. విద్యుత్ ఖర్చుకు సరిపడా డబ్బులు రాకపోయినా తమ బాధ్యత ప్రకారం సినిమాను వేశామని థియేటర్ యాజమాన్యం తెలిపింది. అతని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇంకోవైపు ఓ 70 ఎంఎం థియేటర్ కు కేవలం ఒకే ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వచ్చాడు. ఆ ఒక్కడి కోసమే సినిమా వేశారు థియేటర్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో, ఓ థియేటర్ యజమాని మాట్లాడుతూ, మోదీ నిర్ణయం తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని... అయినా, మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. మరోవైపు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లపై కూడా నోట్ల రద్దు ప్రభావం పడింది. మాల్స్ అన్నీ బోసిపోయి కనిపించాయి. హైదరాబాద్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

జోకులకు తక్కువేం లేదు...

పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల దేశ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే... సోషల్ మీడియాలో జోకులు మాత్రం ఆగటం లేదు. నల్లధనం, అదే రీతిన ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను, సినిమా, ఆఖరికి ముష్టివాళ్లను కూడా వదలకుండా వెటకారపు వీడియోలు, ఫోటోలు వైరల్ అయిపోతున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ అస్వస్థతకు ఈ నిర్ణయమే కారణమంటూ ఓ పోస్ట్ ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో తెగ వైరల్ అవుతోంది. టీడీపీ నేత వర్ల రామయ్య దీనిని ఉదాహరిస్తూ జగన్ ను కామెంట్లు చేయటం విశేషం. ఇంకోపక్క రజనీకాంత్, అలియాభట్, ధోనీ, రైనా, బాహుబలి, సర్జికల్ స్ట్రైక్స్, ట్రంప్, సన్నీలియోన్, రాందేవ్ బాబా, రాహుల్, కేజ్రీవాల్ ఇలా ఎవరినీ వదలిపెట్టడం లేదు. ఇవేకాదు రోడ్ల వెంబడి సంచులు దొరకటం, నోట్లు తగలేయటం, అడుక్కునేవాళ్లకు ఇచ్చేయటం, బినామీ ట్రాన్స్ ఫర్ లు, కేజీల చొప్పున పాత నోట్ల అమ్మకాలు ఈ సీన్లన్నీ కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat Theater  One Man  Demonetisation effect  Currency deaths  

Other Articles