అనంత సభలో పవన్ కల్యాన్ న్యూలుక్.. Pawan Kalyan new look in Anantapur sabha

Pawan kalyan new look in anantapur sabha

Jana Sena Party, Pawan Kalyan, Special Category Status to Andhra Pradesh,​ AP special status, Andhra pradesh special status, Ap political news, JSP, TDP., BJP, power star pawan kalyan, PK janasena, janasena ananthapur

Jana Sena Party supremo Pawan Kalyan new look with specticles in ananthapur seemandhra hakkula chaitany sabha

అనంత సభలో పవన్ కల్యాన్ న్యూలుక్

Posted: 11/10/2016 05:23 PM IST
Pawan kalyan new look in anantapur sabha

అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త గెటప్ లో కనిపించారు. అనంతపురం కరువు పరిస్థితి గురించి చెప్పే ముందు తాను ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తానని చెబుతూ.. ప్రత్యేక హోదా గురించి చదివి, చదివి తనకు కళ్లజోడు కూడా వచ్చేసిందని చమత్కారంగా చెబుతూ కళ్లద్దాలను పెట్టుకున్నారు. ఇలా అయన కళ్లజోడు పెట్టుకున్నారో లేదో.. అభిమానులు, పార్టీ శ్రేణులు అరుపులు, కేకలు, కరతాళధ్వనులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

‘‘స్పెష‌ల్ ప్యాకేజీ గురించి చ‌దివి నాకు సైటు కూడా వ‌చ్చేసింది. ప్రత్యేక హోదాను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. మన సంపదని మన కష్టాన్ని బయటి వాళ్లకి ఇచ్చేసి మళ్లీ కొనుక్కుంటున్నామంటూ 1970లో ఓ వ్యక్తి రాసిన పుస్తకం నేను చదివాను. ఆ పరిస్థితులు ఇప్పటికీ ఎందుకు కొనసాగుతున్నాయి? మా మంచి త‌నంతో ప్రభుత్వాలు ఆడుకోకూడ‌దు. మా అత్మగౌరవం చులక చేసి చూడకండీ’’ అని అన్నారు. అదే సమయంలో గత తిరుపతి, కాకినాడ సభల్లో పవన్ కల్యాన్ వేషాధారణకు అనంతపురంలో సభకు కూడా స్పష్టమైన తేడా కనిపించింది.

తిరుపతి, కాకినాడ సభలకు కుర్తా ధరించి వచ్చిన ఆయన అనంతపురం సభలో ఢిఫరెంట్ గా నేవీ బ్లూ కలర్ చోక్కాలో అగుపించారు. తనకు సీనిమాలు అంటే ఇష్టమని అయితే సినీమా హీరోగా గత దశాబ్దమున్నర కాలానికి పైగా తాను కొనసాగినా తనకు సంతృప్తి లేదన్నారు. ప్రజలు కష్టాలలో వుంటే తాను ఎలా సంతృప్తి చెందుతానని ప్రశ్నించుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల భావోద్వేగాలతో ప్రభుత్వాలు అడుకోవద్దని, వారి మూలాలు ప్రజల మధ్యే వున్నాయని తెలుసుకోవాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  anathapur  JSP  TDP  BJP  Congress  

Other Articles