సాయం అందినా... గాంధీ మనవడు చనిపోయాడు | Mahatma's grandson Kanu Gandhi passes away

Mahatma s grandson kanu gandhi passes away

Kanu Gandhi passes away, Gandhi grandson died, Kanu Ramdas Gandhi news, Mahatma Gandhi grand children, Gandhi's grandson, Kanu

Kanu Ramdas Gandhi, Gandhiji's grandson and ex-Nasa scientist, dies.

గాంధీ మనవడి కన్నుమూత

Posted: 11/08/2016 07:58 AM IST
Mahatma s grandson kanu gandhi passes away

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహాత్మా గాంధీ మనవడు కానూ రాందాస్(87) ఇక లేడు. అక్టోబర్ 22న ఎడమవైపు భాగం చచ్చుబడిపోవటంతో సూరత్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం చేరిన ఆయన మృతి చెందాడు. కానూ గాంధీకి భార్య శివలక్ష్మి మాత్రమే ఉన్నారు, సంతానం లేదు.

కాగా, కానూ నాసా మాజీ సైంటిస్టు. కాగా, 1930 మార్చి-ఏప్రిల్ లో నిర్వహించిన దండి సత్యాగ్రహం సమయంలో గుజరాత్ లోని దండి గ్రామంలో మహాత్మాగాంధీతో కలిసి చిన్నారి కనూ గాంధీ నడిచివెళ్తున్న ఫొటో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫొటోలో గాంధీ చేతిలోని కర్రను ఒక వైపు పట్టుకున్న చిన్నారి కానూగాంధీ ముందు నడుస్తుండగా, ఆయన వెనుక మహాత్ముడు నడిచి వెళ్తుంటాడు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కానీ, ఆఖరికి మోదీ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదన్న విమర్శలు వినిపించాయి.

అయినా వారు కూడా ఎవరూ లేకపోవటంతో ఉన్న ఒక్కగానోక్క స్నేహితుడు దిమంత్ బాధియా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. కానూ వైద్యం కోసం 21,000 రూ. అందించాడు. అయితే ఆయన చికిత్సపొందిన శివ జ్యోతి ఆస్పత్రి మాత్రం జాతిపితపై ఉన్న గౌరవంతో ఆయన మనవడికి ఉచితంగానే ట్రీట్ మెంట్ అందించాయి.

ఆయన భార్య కోరిక ప్రకారం మంగళవారం ఉదయం కానూ అంత్యక్రియలు సూరత్ లో జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahatma Gandhi  Grandson  Ex-NASA scientist  Kani Ram Das Gandhi died  

Other Articles