కేంద్ర మంత్రికి యువతి షాకింగ్ వీడియో | Northeast girl discriminated at Delhi Jama Masjid.

Northeast girl sends discriminated video to union minister

Jama Masjid discrimination, Northeast people discrimination, Girl sends video to MoS Home Kiren Rijiju, Kiren Rijiju twitter, Kiren Rijiju on discrimination, Kiren Rijiju East India people dicriminattion, East India people identity

Niyang Pertin, who hails from Arunachal Pradesh and studies law at Delhi University, posted a video on social media tagging MoS Home Kiren Rijiju narrating the discrimination she faced at Delhi's Jama Masjid.

కేంద్ర మంత్రికి యువతి షాకింగ్ వీడియో

Posted: 11/04/2016 08:54 AM IST
Northeast girl sends discriminated video to union minister

కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జూకి ఓ యువతి పంపిన వీడియో సందశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో తనకు, తన స్నేహితురాళ్లకు జరిగిన ఘోర అవమానం గురించి అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆ యువతి అందులో పేర్కొంది. ప్రముఖ జమా మసీదు సెక్యూరిటీ సిబ్బంది తమతో ప్రవర్తించిన తీరును యువతి ఆవేదనతో వ్యక్తం చేసింది.

నియాంగ్ పెట్రిన్ అనే అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థి. కొన్ని రోజుల క్రితం నియాంగ్ ఊరి నుంచి వచ్చిన తన స్నేహితులతో కలిసి ఇటీవల ఢిల్లీలోని జామా మసీదును సందర్శించింది. ఈ సందర్భంగా గేట్ నంబర్ 8 వద్ద ఫోన్ మాట్లాడుతున్న తమ వద్దకు సిబ్బంది వచ్చారంట. ఫోన్ మాట్లాడటం నేరం అంటూ 300 చెల్లించాల్సిందేనని బెదిరించారంట.. ఇతరులు అందరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్తున్నా, విచ్చల విడిగా మాట్లాడుతున్న తమను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారంటూ వారు ప్రశ్నిస్తే.. అసలు మీరు భారతీయులేనా, ఐడెంటీ కార్డులు చూపించాలంటూ గొడవకు దిగారని ఆవేదన వ్యక్తం చేసింది.

 

ఈశాన్య ప్రాంతానికి చెందిన తాను ప్రతిసారీ తన జాతీయతను నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యూజియం, పార్క్.. ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు అడుగుతున్నారని పేర్కొంది. తాను విదేశీయురాలని కాదని, అచ్చమైన భారతీయురాలినని పేర్కొన్న నియాంగ్ తమను భారతీయులుగా గుర్తించే రోజు ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నియాంగ్‌కు రీట్వీట్ ద్వారా హామీ ఇచ్చాడు.మరో ట్వీట్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవటం ప్రారంభించిందని తెలిపాడు.

కాగా, ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజలకు ఇలాంటి అవమానాలు గతంలో చాలానే జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వారిని భారతీయులుగానే పరిగణించాలన్న డిమాండ్ లెవనెత్తుతూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఎత్తున్న ఉద్యమం లేపారు అక్కడి యువత. ఇక మరోపక్క ఈ ఘటనపై ఢిల్లీ టూరిజం శాఖ స్పందించింది. జమా మసీదులోని ప్రవేశ రుసుము ఫ్రీ కాగా, ఫోటోగ్రఫీ కోసం 200 రూపాయలు వసూలు చేస్తారంట. విషయం తమ పరిధిలోకి ఇంకా రాలేదని, విచారణ జరిపి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : East Indian People  Discrimination  Girl post video  MoS Home Kiren Rijiju  

Other Articles