రథసారథి కోసం కలెక్టర్, డ్రైవర్ అయ్యాడు | Collector Drives Chauffeur in Maharashtra

Collector drives chauffeur in maharashtra

Collector Drives Chauffeur, Collector Drives car in Maharashtra, Chauffeur Farewell Gift, Akola Collector and Driver, Collector becomes driver for his driver, Digambar Thak Sreekanth, Collector Sreekanth

As Farewell Gift, Collector Drives Chauffeur To Work On Retirement Day.

ఆ కలెక్టర్ కాస్త కారు డ్రైవర్ గా మారిపోయాడు

Posted: 11/04/2016 10:28 AM IST
Collector drives chauffeur in maharashtra

సాధారణంగా పవర్ చేతిలో ఉన్నవారు కిందిస్థాయి సిబ్బందితో పేకాట ఆడేసుకుంటారన్న ఓ అపవాదు ఉంది. ఇంటి పనుల దగ్గరి నుంచి తమ ఆదేశాలతో వారితో ఎలాంటి పనులనైనా చేయించుకునే సామర్థ్యం ఉన్న అధికారులు మనకు తరచూ వార్తల్లో తారసపడుతూనే ఉంటారు. అదే సమయంలో అధికారంతో భోగాలు కూడా అనుభవిస్తూ, వాటిని దుర్వినియోగం కూడా చేస్తుంటారు.

ఇక్కడ ఒక ఫోటోను జాగ్రత్తగా గమనించండి. పైన పూలు కలర్ ఫుల్ డెకరేషన్ ఏదో హనీమూన్ కి వెళ్లే కారులా కనిపిస్తుందా? దానిని లోతుగా పరిశీలించండి. నెత్తిన టోపీ, డ్రైవర్ డ్రెస్ కోడ్ తో ఉన్న ఒక వ్యక్తి వెనుక సీట్ లో దర్జాగా కూర్చుంటే.. ముందు డ్రైవింగ్ సీట్ లో సూట్ వేసుకున్న ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ రథసారథిగా ఉంది ఓ జిల్లా కలెక్టర్. ఇక వెనకాల కూర్చుందేమో ఆయన డ్రైవర్ గారు. కాస్త వింతంగా ఉన్న ఈ కథేంటో తెలియాలంటే మహారాష్ట్రలోని అకోలా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లాల్సిందే.

ముందు ఆ డ్రైవర్ దొరగారి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు దిగంబర్ థాక్. వయసు 58 ఏళ్లు. అలోక్ కలెక్టర్ కారుకి డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తుంటాడు. సర్వీస్ ముగియటంతో ఈ మధ్యే ఆయన పదవీ విరమణ చేశాడు. అయితే ఇన్నాళ్లు అలసిపోయిన అతగాడికి ప్రస్తుత కలెక్టర్ శ్రీకాంత్ చివరిరోజు వెరైటీగా వీడ్కోలు ఇద్దామనకున్నాడు. అందుకే తానే స్వయంగా డోర్ తెరిచి దిగంబర్ ను కూర్చోబెట్టి, కారు డ్రైవింగ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసులో జరిగే వీడ్కోలు వేడుకకు తీసుకెళ్లాడు.

35 ఏళ్ల సర్వీసులో 18 మంది కలెక్టర్లకు డ్రైవర్ గా దిగంబర్ పని చేశాడు. ఇన్నేళ్లలో వారిని భద్రంగా గమ్యస్థానాలకు చేర్చటంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే చివరి రోజు ఆయన జీవితంలో మరిచిపోకుండా కృజత్నతతో ఇలా తీసుకెళ్లాను అంటూ కలెక్టర్ శ్రీకాంత్ వెల్లడించాడు. దీనిని కూడా అధికార దుర్వినియోగం వెతుక్కునే జనాలు ఉంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Aloka Collector  Driver avatar  Chauffeur Digambar Thak  

Other Articles