ప్రాణాలతో ఉంచారా? చంపేశారా? | where is Maoist top leader RK.

Where is maoist top leader rk

HC on Maoist leader RK, AOB encounter RK, maoist top leader RK, RK where, HC on RK AP govt, AP govt deadline on RK, RK alive or dead

High Court raps AP Govt over whereabouts of Maoist leader RK.

ఆయన మిస్సింగ్ పై అందరికీ అనుమానాలే!

Posted: 11/01/2016 07:37 AM IST
Where is maoist top leader rk

ఇటీవ‌ల‌ ఏవోబీలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ లో మావోలకు భారీ నష్టం వాటిల్లిందనే చెప్పొచ్చు. కీలకమైన ఉదయ్ దళం తుడిచిపెట్టుకుపోవటంతోపాటు తెలిసిందే. పలువురు కీలకనేతలు చనిపోవటంతోపాటు, అగ్రనేతలు గాయాలతో తప్పించుకుపోవటంతో అటవీ ప్రాంతం ఇంకా బూట్ల చప్పుడు ఆధీనంలోనే ఉంది. ఇదిలా ఉంటే ముఖ్యనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే పోలీసులకు చిక్కాడని, గాయాలతో ఆయన్ని పట్టుకున్న పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేసిన ఆర్కే భార్య హైకోర్టు ను కూడా ఆశ్రయించింది.

ఎన్ కౌంటర్ త‌రువాత త‌న భ‌ర్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని ఆరోపిస్తోన్న ఆర్కే భార్య శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నిన్న మధ్యాహ్నాం తర్వాత దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆర్కే ను కోర్టు ముందు హాజరు పరచాలని ఆమె కోరగా, న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది. ఆర్కే ఆచూకీ త‌మ‌కు తెలియ‌జేయాలని హైకోర్టు ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆర్కే చ‌నిపోయాడో పోలీసు క‌స్ట‌డీలో ఉన్నాడో తెల‌పాల‌ని ఆదేశించింది. వాదనలు కొనసాగుతుండగా ఏదో జ‌రిగింద‌ని త‌మ‌కు అనిపిస్తోంద‌ని ధర్మాసనం వ్యాఖ్యానించటం విశేషం. ఆర్కేకు ఎలాంటి హానీ త‌ల‌పెట్ట‌కూడ‌దని చెప్పిన కోర్టు, దీనిపై పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సూచించింది. మావోయిస్టులైనా, సామాన్యులైనా ర‌క్షించాల్సింది ప్ర‌భుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్ అంటూ హరగోపాల్ లాంటి ఫ్రోఫెసర్ లు కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తుండటంతో ఆర్కే విషయంలో పోలీసులు గోప్యతను ప్రదర్శించటం నిజమేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AOB encounter  Ramakrishna  Missing  

Other Articles