స్వీట్లు పంచకుండానే దీపావళి పండగ? | No exchange of sweets at India-Pakistan border

No exchange of sweets at india pakistan border

no sweets at border, diwal army celebrations, No sweets for armt diwali, sweets distribution at border, India-Pak sweets, wagah sweets distribution, Indian Army Diwali celebrations , UN diwali celebrations

According to Uri attack, No exchange of sweets at India-Pakistan border for Diwali festival.

స్వీట్లు లేకుండానే దీపావళి పండగనా?

Posted: 10/31/2016 07:32 AM IST
No exchange of sweets at india pakistan border

దీపావళి అంటేనే మిఠాయిల పండగ. అలాంటిది అవి లేకుండానే ఏంటి? అనుకుంటున్నారా!పైగా మనదేశంలోనే... ఓవైపు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి అధికారికంగా దీపావళి వేడుకలు జరిపి ప్రపంచానికి మన పండగ వెలుగులు పంచిన వేళ,   ఈ వెలుగులకు కారణమౌతు సరిహద్దులో కాపల కాస్తున్న సైన్యానికి భారత ప్రధాని స్వయానా అంకితమిచ్చాడు. అయితే వారు మాత్రం నోరు తీపి చేసుకోకుండానే దీపావళిని జరుపుకున్నారు. 

సాధారణంగా పండుగలప్పుడు బోర్డర్ దగ్గర భారత్, పాక్ సైనికులు స్వీట్లు పంచుకుని, శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయతీ. పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే, ఉరీ ఉగ్రదాడి అనంతరం, సర్జికల్ దాడులతో భారత్ సమాధానం చెప్పడంతో... పాక్ వైపు నుంచి నిరంతరం కాల్పుల ఒప్పంద విరమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో, సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలో, దీపావళి పర్వదినాన స్వీట్లు పంచుకునే కార్యక్రమానికి తెరపడింది. భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్లు కేవలం దీపాల వెలుగులతో సరిపెట్టారు. అయితే ఇదేం కొత్త కాదని, గతంలో కూడా కొన్ని సార్లు ఇదే మాదిరి ఈ కార్యక్రమం ఆగిపోయిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diwali  Army  India Pak diwali celebrations  

Other Articles