ఇటలీని కుదిపేసిన మరో భూకంపం.. చారిత్రక భవనాలు నేలమట్టం Italy hit by strongest quake in 35 years, no deaths reported

Italy hit by strongest quake in 35 years no deaths reported

eathquake, italy earthquake, italy quake, italy quake epicenter, italy earthquake epicenter, news, latest news, Accidents and disasters, Earth science, international, Governm, Science, Visual arts, Natural disasters

The powerful earthquake to hit Italy in two months spared human life but struck at the nation's identity, destroying a Benedictine cathedral, a medieval tower and other beloved landmarks

ఇటలీని కుదిపేసిన మరో భూకంపం.. చారిత్రక భవనాలు నేలమట్టం

Posted: 10/30/2016 05:52 PM IST
Italy hit by strongest quake in 35 years no deaths reported

ఇటలీలలో భూమి కంపించింది. ఇటీవల భూ ప్రకంపనలు చోటుచేసుకుని ప్రమాదం నుంచి తప్పించుకన్న ఇటీలీ వాసులు ఈ సారి కంపించిన భూమి విషాధాన్నే మిగిల్చినట్లు సమాచారం. సెంట్రల్ ఇటలీలో 7.1 తీవ్రతతో భూమి కంపించిందని రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత నమోదు కావడంతో భారీ విషాదం అలుముకుందని అధికారులు అంటున్నారు. అయితే భారీ స్థాయిలో వచ్చిన భూ ప్రకంపనల ధాటికి ఇటలీలో ఎంత నష్టం వాట్లిల్లిందన్న వివరాలు తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.

గత 35 ఏళ్లలో ఇంతటి భారీ భూకంపం సంభవించలేదని, దీంతో సెంట్రల్ ఇటీవాసలు భయాందోళనకు గురయ్యారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారని అక్కడి మాద్యమాలు వెల్లడించాయి. ప్రకంపనల ధాటికి పలు పలు ఇళ్లు కంపించాయని, ఇళ్లలోని సామాగ్రి స్వల్పంగా దెబ్బతినట్టు స్థానిక మీడియా తెలిపింది. రోమ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నారు. ఆగ్నేయ పెరుగ్వియాకు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూమి ప్రకంపనలు తీవ్రత అధికంగా వుండటం వల్ల చారిత్రాక వారసత్వంగా వస్తున్న హెరిటేజ్ సంపదైన పురాతన కట్టడాలు, భవనాలు కూడా బాగా దెబ్బతిన్నాయిని, పలు చోట్ట పురాతన కట్టడాలు కూడా కుప్పకూలాయని అధికారులు చెబుతున్నారు.

గత బుధవారంనాడు కూడా మధ్య ఇటలీలో రెండుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, ఇవాళ్టి భూకంప తీవ్రత 7.1గా యుఎస్‌జీఎస్, ఇటాలియన్ మాధ్యమాలు ప్రకటించాయి. కాగా, ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలినట్టు ఇటలీ సివిల్ ప్రొటక్షన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టారు. అయితే భూకంపలో ప్రాణనష్టం ఎంత మేరకు వుందన్న వివరాలు తెలియరాలేదు, మృతుల సంఖ్య గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eathquake  italy  heritage buildings  life loss  Accidents and disasters  

Other Articles