సమాజ్ వాదీ సంక్షోభంపై మాయావతి సంచలన కామెంట్ SP infighting staged to hide govt failures says Mayawati

Sp infighting staged to hide govt failures says mayawati

uttat pradesh assembly elections, samajwadi party, mulayam singh, akhilesh yadav, shivpal yadav, government failures, mayawati, BSP, BJP, maha katbandhan, congress, news, india news

Former Uttar Pradesh cm and BSP chief Mayawati said the infighting in the ruling Samajwadi Party is a 'stage-managed affair' to divert attention from the state government's failures.

సమాజ్ వాదీ సంక్షోభంపై మాయావతి సంచలన కామెంట్

Posted: 10/30/2016 05:07 PM IST
Sp infighting staged to hide govt failures says mayawati

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై బీఎస్సీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ములాయం సింగ్ సహా అయన సోదరుడు శివపాల్ యాదవ్, తనయుడు, యుపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అడిన కుటుంబ డ్రామాగా కోట్టిపారేశారు. తాము అధికారంలోకి వస్తే అఖిలేష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునర్విచారణ చేపడతామని కూడా ప్రకటించారు.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన చుట్టూ నేరచరితులను ఉంచుకున్నారని విమర్శలు చేశారు. ఓ న్యూస్ ఏజన్సీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ వెర్రివాళ్లను చేస్తోందని అన్నారు. వచ్చే సంవత్సరం యూపీ ఎన్నికల్లో గూండాలను వాడుకోవాలని ఎస్పీ చూస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ, ఆ హామీ ఏమైందని, బీజేపీ ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని పొందిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో తమ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  samajwadi party  mulayam singh  akhilesh yadav  shivpal yadav  government failures  mayawati  BSP  BJP  

Other Articles