ఈ దీపావళి భారత సైనికులకు అంకితం: మోదీ Mann Ki Baat: PM Modi dedicates this Diwali to our jawans

Mann ki baat pm modi dedicates this diwali to our jawans

mann ki baat, mann ki baat modi, modi mann ki baat, mann ki baat air, mann ki baat youtube, mann ki baat radio, modi radio, mann ki baat time, mann ki baat video, india news

During the last episode, PM Modi had stated that tremendous anger has been simmering within the nation following the terrorist attack in Uri.

ఈ దీపావళి భారత సైనికులకు అంకితం: మోదీ

Posted: 10/30/2016 03:12 PM IST
Mann ki baat pm modi dedicates this diwali to our jawans

భారత మాతను, మాత ముద్దుబిడ్డలను శత్రు సేనల నుంచి అనునిత్యం కాపాడుతున్న జవాన్ల సేవలను దేశప్రజలందరూ కొనియాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకని సరిహద్దులోని సైనిక బలగాలకు సందేశాలు పంపిన దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశప్రజలను ఉద్దేశించి 25వ సారి తన మనస్సులోని మాట 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. తొలుత దేశప్రజలందరికీ ఆయన దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

దేశప్రజలు ప్రశాంతంగా, ఉత్సాహంగా దీపావళి వంటి పండుగలు చేసుకోగలుగుతున్నామంటూ ఏడాది పొడవునా సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్న జవాన్లే కారణమని, సాయుధ దళాలకు ఈ దీపావళి అంకితమని అన్నారు. కొద్ది నెలలుగా జవాన్లు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారని, వారిని స్మరించుకుంటూ మనమంతా ఈ దీపావళిని జరుపుకొందామని ప్రధాని అన్నారు. వీరజవాన్ల స్మృత్యర్థం భారత సాయుధ దళాలు ఉన్న ప్రతి యూనిట్ వద్ద ఒక్కో దీపం వెలిగించాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.

సాయుధ దళాల సేవలను ప్రధాని గుర్తు చేస్తూ, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, నావికాదళం, వాయుసేన, జవాన్లు దేశప్రజలందరికీ రక్షణగా నిలుస్తున్నందునే మనం ఈ రోజు ఇంత సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొంటున్నామని తెలిపారు. సైనికుల నిష్కలంక ప్రేమ, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సైనికులందరికీ దీపావళి శుభాకాంక్షలు పంపాలను ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కూడా మోదీ గుర్తు చేశారు. సర్దార్ పటేల్ జయంతి (అక్టోబర్ 31)ని ఏక్తా దివస్‌గా జరుపుకొంటున్నామని, ఈ సందర్భంగా ప్రజలంతా ఐక్యతా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.

పరిశుభ్రతతో ముడిపడిన పండుగ దీపావళి అని, ప్రతి ఒక్కరూ తన ఇళ్లను పరిశుభ్రం చేసుకోవడంతో పాటు చుట్టుపక్కలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకను ఎంతో వేడుకగా జరుపుకొంటున్నారని చెప్పారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడెయు దీపావళి సందర్భంగా దీపం వెలిగిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారని, బ్రిటన్ ప్రధాని థెరెసా మే దీపావళి వేడుకల రెసెప్షన్ ఇస్తున్నారని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  mann ki baat  Indian army  United Nations  Diwali  

Other Articles