పండగ రోజున కూడా పాకిస్తాన్ కు ధీటుగా బదులిచ్చిన ఆర్మీ Four Pakistan posts across LoC destroyed, says Army

Four pakistan posts across loc destroyed says army

soldier mutilation, mutilation, loc, mutilation pakistan, pakistan posts destroyed, body mutilation, india pakistan, Pakistan. pak rangers, posts destroyed, PoK, terrorists, soldier body mutilated, Army, Jammu and Kashmir

Indian Army announced it had carried out a massive assault across the Line of Control, destroying four Pakistani posts and inflicting heavy casualties.

పండగ రోజున కూడా పాకిస్తాన్ కు ధీటుగా బదులిచ్చిన ఆర్మీ

Posted: 10/30/2016 10:19 AM IST
Four pakistan posts across loc destroyed says army

యావత్ దేశం దీపావళి పండగ పర్వదినాన్ని జరుపుకుంటున్న సమయంలోనూ దాయాధి పాకిస్తాన్ మాత్రం మళ్లీ కాల్పులకు తెగబడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. వరుసగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు భారత రక్షణ దళాలు కూడా ధీటుగా సమాధానమిస్తున్నాయి, ఇప్పటికే మన సైనికుడిని హత్యచేసి.. అతని శరీరాన్ని ముక్కలు చేసిన ఘటనపై రగిలిపోతున్న సైన్యం పాకిస్థాన్‌కు దీటైన బదులు ఇచ్చింది.

వాస్తవాధీన రేఖ మీదుగా ఉన్న పాక్‌ సైనిక పోస్టులు లక్ష్యంగా పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ.. నాలుగు దాయాది దేశపు సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో పాక్‌ సైనికులు పెద్ద ఎత్తున దెబ్బతిని ఉంటారని సైన్యం ప్రకటించింది. సరిహద్దుల మీదుగా ఉత్తర కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో ఈ దాడులు జరిపినట్టు సైన్యం ప్రకటించింది. ‘కేరన్‌ సెక్టర్‌లో జరిపిన భారీ కాల్పుల్లో నాలుగు పాకిస్థాన్‌ పోస్టులు ధ్వంసమయ్యాయి. పాక్‌ సైన్యం పెద్ద ఎత్తున నష్టపోయింది’ అని ఆర్మీ నార్తరన్‌ కమాండ్‌ ప్రకటించింది. ఎంతమంది పాక్‌ సైనికులు చనిపోయారనే దానిపై సైన్యం మరిన్ని వివరాలు తెలుపలేదు.

కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టర్‌లో సైనికుడు మన్‌దీప్‌ సింగ్‌ను హతమార్చి.. ఆయన దేహాన్ని ఉగ్రవాదులు ముక్కలుగా నరికిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన్న ఉగ్రవాదులను సైన్యం అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతిచెందిన మన్‌దీప్‌ దేహాన్ని ముక్కలు నరికి.. ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌ (పీవోకే)లోకి పారిపోయారు. ఈ దుర్మార్గ చర్యపై భారత సైన్యం తీవ్రంగా స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan. pak rangers  posts destroyed  PoK  terrorists  indian soldier  mutilated  Army  Jammu and Kashmir  

Other Articles