‘‘దీపావళికి శుభాకాంక్షలు కాదు.. జీవితాలకు వెలుగునివ్వండీ’’ Rahul Gandhi demands centre deliver on armed forces'

Rahul gandhi demands centre deliver on armed forces demands as diwali gift

rahul gandhi, narendra modi, rahul gandhi letter. rahul letter to pm modi, orop, soldiers, one rank one pension, modi diwali greetings, army diwali greetings, PM Modi, letter, diwali, greetings, one rank one pension, soilders rahul gandihi

Hurting the sentiments of India’s Armed Forces, Congress vice president Rahul Gandhi called on PM Modi to implement the One Rank One Pension (OROP) in a meaningful way, as soldiers should not struggle to claim what is due to them.

‘‘దీపావళి కానుకగా.. ఆర్మీ జీవితాలకు వెలుగునివ్వరా మెదీగారూ’’

Posted: 10/29/2016 04:23 PM IST
Rahul gandhi demands centre deliver on armed forces demands as diwali gift

ఇండియన్ ఆర్మీకి ఈ దీపావళి నిజంగానే వెలుగులు తీసుకువస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ వినతితో ఆర్మీకి దేశ ప్రజల నుంచి దీపావళి శుభాకాంక్ష్లలు వెల్లివిరుస్తుండగా, తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీ భారత సైనిక దళాలకు మద్దుతుగా నిలిచారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి ఈ దీపావళి శుభాకాంక్షలు తెలిపి.. మీకు మద్దతుగా యావత్ దేశం నిలబడిందన్న సందేశాన్ని ఇవ్వాలని కోరిన విషయం తెలిపిందే. అయితే శుభాకాంక్షలతో పనులు నామమాత్రమేనని, వారి జీవితాలలో వెలుగులు నింపాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నారు.

నిత్యం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని విమర్శంచే రాహుల్.. ఆయన దృష్టికి ఆర్మీ సభ్యుల వినతిని తీసుకెళ్తూనే ఆయను విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మనోభావాలను దెబ్బతీస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌వోపీ) విధానాన్ని అర్థవంతంగా అమలుచేయాలని, సైనికులు తమ పెన్షన్‌ పొందే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతూ రాహుల్‌ లేఖ రాశారు.

అనుక్షణం దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల సంక్షేమాన్ని బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో శత్రుసేనల పీచం అణచగలమని భారత ఆర్మీ నిరూపించిన కొద్ది రోజులకే కేంద్రం వారి అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్‌ లో కొత్తగా స్లాబ్‌ విధానంగా మార్చారు. దీనివల్ల గాయపడిన సైనికులకు అందే పెన్షన్ లో ఘననీయమైన మార్పులున్నాయని.. అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. పౌర ఉద్యోగులతో పోలిస్తే సైనికలకు వేతనం విషయంలో ఎంతో వివక్ష, వ్యత్యాసం కనిపిస్తోందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కోన్నారు. ఈ తప్పులను సరిచేసి సైనికుల జీవితాలలో ఈ దీపావళి నుంచి వెలుగులు నింపాలని కోరారాు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  soldiers  Indian Armed Forces  one rank one pension  

Other Articles