రిక్షావాలాకు ఇది అసలైన దీపావళి.. తలుపుతట్టిన లక్ష్మీదేవి this diwali brings new lights in Rickshaw pullers life

This diwali brings new lights in rickshaw pullers life

Uttarpradesh, CM Akhilesh yadav, paytm ceo, Vijay Shekhar Sharma, samajwadi party, shivpal yadav, mulayam singh yadav, amar singh, uttar pradesh politics, uttar pradesh elections, up assembly elections, uttar pradesh assembly elections, up polls, up votes, samajwadi party

This Diwai brings new lights in a rickshaw puller life who helped Paytm's Vijay Shekhar Sharma make it to UP CM Akhilesh Yadav's house has been rewarded with Rs. 6,000, a new cycle rickshaw and the promise of a new home.

రిక్షావాలాకు ఇది అసలైన దీపావళి.. తలుపుతట్టిన లక్ష్మీదేవి

Posted: 10/29/2016 04:58 PM IST
This diwali brings new lights in rickshaw pullers life

దీపావళి అనగానే లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టాలని రకరకాల పూజలు చేస్తూ.. దేవతను అహ్వినస్తూ ఇంటిని, ఇంటి అవరణను కూడా శభ్రంగా చేసి అమ్మవారిని అహ్వనిస్తూ దీపాలను, విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. అయితే ఇవేమీ చేయకున్న లక్ష్మీదేవీ ఓ రిక్షావాలా జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. సుమారు నలభై ఏళ్లుకు పైబడిన వ్యక్తి జీవితంలో ఈ దీపావళి కొత్త వెలుగుల్ని పంచుతుంది. ఇందుకోసం తన పనిని తాను చేయడమే ఆ రిక్షావాలా చేసిన పని.

నిత్యం ఎంతో మంది కస్టమర్లను చూసిన రిక్షావాలా.. అతను కూడా అలానే వచ్చాడని భావించాడు. సాధారణ కస్టమర్ మాదిరిగానే అతన్ని తీసుకోచ్చాడు. అతను ఏకంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లమని అదేశించడంతో.. కొద్దిగా అలోచనలో పడ్డాడు. ఆ తరువాత అతన్ని కలవడానికి ముఖ్యమంత్రే ఇంటిబయటకు రాగానే ఖంగుతిన్నాడు. అదే అతనికి అదృష్టాన్ని తీసుకోచ్చి పెట్టింది. అతనెవరో కాదు పేటీయం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ. సాక్షాత్తు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను కలిసేందుకు బయలుదేరిన పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కూడా ఇలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.

దీంతో ఆయన తన కారును కాదని రిక్షాను అశ్రయించాడు. దేశంలోనే టాప్‌ మొబైల్‌ వ్యాలెట్‌ స్టార్టప్‌ అధినేత ఇలా రిక్షాలో రావడంతో సీఎం అఖిలేశ్‌ ఒకింత విస్తుపోయారు. దీంతో తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్‌ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్‌ సీఈవో విజయ్‌ రిక్షా సైకిల్‌లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి’  అని అఖిలేశ్‌ పేర్కొన్నారు. దీంతో విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది.

రిక్షా కార్మికుడికి కొత్త రిక్షా అందిస్తానని, దాంతో పాటు సొంతింటి కలను కూడా తీరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రే మణిరామ్ హామి ఇచ్చారు. ఇక సీఈఓను తీసుకువచ్చినందుకు గాను ఆరు వేల రూపాయల నగదును రివార్డుగా అందించారు ముఖ్యమంత్రి అఖిలేష్. ఇక, రిక్షా సవారీ చేసిన పీటీఎం అధినేత విజయ్‌.. ఆ కార్మికుడికి నేరుగా డబ్బు ఇచ్చారా? లేక పేటీఎం ద్వారా ఈ-పేమెంట్‌ చేశారా? అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarpradesh  CM Akhilesh yadav  paytm ceo  Vijay Shekhar Sharma  samajwadi party  

Other Articles