ఎన్నికల వేళ.. హిల్లరీ క్లింటన్ సెల్స్ గోల్ చేసుకుందా..? Hillary Clinton 'confident' over new FBI email probe

Fbi examining hillary clinton emails found in anthony weiner probe

US presidential elections, hillary clinton, FBI, e-mail probe, donald trump, emocratic party, republican party, hillaru clinton emails probe, hillary confident

Hillary Clinton says she is "confident" a new FBI probe linked to her emails will not change its original finding that she should not be prosecuted.

ఎన్నికల వేళ.. హిల్లరీ క్లింటన్ సెల్ఫ్ గోల్ చేసుకుందా..?

Posted: 10/29/2016 03:20 PM IST
Fbi examining hillary clinton emails found in anthony weiner probe

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో పది రోజులల వ్యవధి వున్న తరుణంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్ సెల్స్ గోల్ చేసుకుందా..? అంటే అవునన్న అందోళనలే అమె మద్దతుదారు వర్గం నుంచి వక్యం అవుతున్నాయి. కాగా మరికోందిరు మాత్రం ఈమెయిల్స్ కేసులో విచారణ ఎన్నో నెలలుగా కోనసాగుతుందని, వాటి ప్రభావం ఎన్నికలపై ఏమాత్రం వుండదని అంటున్నారు. హిల్లరీకి తనపై తనకు నమ్మకం వున్నందునే.. తప్పుచేయలదేన్న భావనతోనే అమె తన ఈ-మెయిళ్లపై ఇప్పటివరకూ జరిగిన విచారణలోని వాస్తవాలను బయటపెట్టాలని ఎఫ్ బీఐను డిమాండ్ చేశారని అమె వర్గీయులు అంటున్నారు.

ఎన్నికల తరుణంలో ప్రజలందరికీ తనపై జరుగుతున్న ఈమెయిల్ విచారణ గురించి తెలియాలని, వాటి గురించి ప్రజలకు తెలపాలని హిల్లరీ నిన్న ఓ సమావేశంలో డిమాండ్ చేశారు. అప్పటికే అమెకు సంబంధించిన కొత్త ఈ మెయిళ్లను కూడా పరిశీలిస్తున్నామని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ చెప్పిన కొద్ది సమయంలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే అమె వ్యాఖ్యలు నేపథ్యంలో సెల్ప్ గోల్ చేసకుందన్ని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అమె డిమాండ్ చేయడంతో ఈ మెయిల్ సంబంధించిన అంశం మళ్లీ కోత్తగా ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది.

దీంతో అమెరికా ఓటర్లలో కూడా అసలు ఈ కొత్త ఈ మెయిల్ కు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా బయటకు వచ్చిన ఈ-మెయిళ్లు ఆంథోని వీనర్-వీనర్ కంపెనీకు చెందినవిగా ఎఫ్ బీఐ గుర్తించింది. ఈ కంపెనీ ఓనర్ గతంలో న్యూయార్క్ డెమొక్రటిక్ పార్టీ నేత. మైనర్ బాలికపై లైంగిక దాడులు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. దీంతో హిల్లరీ సెల్ప్ గోల్ చేసుకుందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికలకు పది రోజుల వ్యవధి వున్నందన ఈ అంశం అప్పటికీ ఎలాంటి రూపం దాల్చబోతుందోనన్నది వేచి చూడాలి.

కాగా హిల్లరీ క్లింట్లన్ మాత్రం తన ఈ మెయిళ్ల కేసు విచారణకు సంబంధించి పూర్తి ధీమాగా వున్నారు. తన కేసు వివరాలను తానే బయటకు చెప్పాలని కోరుతున్నాని చెప్పారు. తాను తప్పుచేయలేదన్న ధైర్యంతో వున్నానని, ఇక విచారణ అధికారులే తమ దర్యాప్తులో నిజానిజాలను వెల్లడించాలన్నారు. దాదాపు ఏడాది కాలం పాటు హిల్లరీ ఈ-మెయిళ్లపై విచారణ చేసిన ఎఫ్ బీఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయశాఖ విచారణను నిలిపివేసింది. అయితే తాజాగా బయటపడిన ఈ-మెయిళ్ల కారణంగా మొత్తం కేసును ఎఫ్ బీఐ మళ్లీ తెరచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US presidential elections  hillary clinton  FBI  e-mail probe  donald trump  

Other Articles