యువరాణి టాప్ లెస్ ఫోటోల కోసం నాలుగేళ్ల తర్వాత... | journalists to face trial in France over publication of topless Kate Middleton

Journalists to face trial in france over publication of topless kate middleton

Six journalists to face trial Kate Middleton, Kate Middleton topless , topless Kate Middleton closer magazine, Princess Kate Middleton France Court, Kate Middleton topless secret pics, Prince William topless france, Journalist Britain Royal Family, Kate Middleton Topless photos case

Six journalists to face trial in France over publication of topless Kate Middleton.

ఆమె టాప్ లెస్ కోసం నాలుగేళ్ల తర్వాత...

Posted: 10/26/2016 01:48 PM IST
Journalists to face trial in france over publication of topless kate middleton

ఏకాంతంగా ఉన్న సమయంలో టాప్ లెస్ ఫోటోలు తీయటమే కాదు... వాటిని తమ మ్యాగ్జైన్ లో ప్రచురించినందుకు ఆరుగురు జర్నలిస్టులు ఇప్పుడు పశ్చాత్తాప పడబోతున్నారు. వారిపై కేసు నమోదు కావటమేకాదు, సుదీర్ఘ వాదనల తర్వాత ఏకంగా హైలెవల్ లో ఓ కమిటీతో విచారణ జరగబోతుంది. నేరం రుజువైతే వారందరికీ కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ఫోటోలు ఎవరివి? ఏమా కథ అంటే...

బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్) కేట్ మిడిల్ టన్ లు నాలుగేళ్ల క్రితం హాలిడే కోసం దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ ప్రాంతానికి వెళ్లారు. మూడో మనిషి కూడా అడుగుపెట్టలేని ఆ భవంతి పోర్టికోలో వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. టాప్ లెస్ గా ఉన్న కేట్ విలియమ్స్ మసాజ్ చేసినట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. జూమ్ కెమెరాతో ఆ భంగిమలను, ఆమె టాప్ లెస్ ఫొటోలను కెమెరాలో బంధించారు.

Kate Middleton Topless

ఆ తర్వాత ఆ ఫొటోలను కవర్ పేజ్ పై ముద్రించి మేగజీన్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. అంతేకాదు ఆ ఫోటోలు ఆ తర్వాత యూరప్ లోని అన్ని ప్రముఖ మాగ్జైన్ లలో, పత్రికలో దర్శనమిచ్చాయి. దీనిపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గుమంది. సీక్రెట్ గా ఫొటోలు తీయడమే కాకుండా, వాటిని ప్రచురించి ఇంకా పెద్ద తప్పు చేశారంటూ కేట్ మిడిల్టన్ తరపున లాయర్ల ఫ్రెంచ్ కోర్టులో వాదించారు. దీంతో, మేగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టులతో సహా.ఆరుగురిపై విచారణకు సర్వం సిద్ధమైంది.

నాలుగేళ్ల క్రితం టాప్ లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను ఇప్పుడు వేగవంతం చేసింది. వచ్చే జనవరి నుంచి విచారణ జరుగుతుందని ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాజకుటుంబానికి జర్నలిస్టుల సెంటిమెంట్ అస్సలు అచ్చీరాలేదు. 1997లో ప్రిన్సెస్ డయానా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే స్కూటర్లపై ఆమెను వెంబడిస్తున్న ఫోటోగ్రాఫర్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆమెకు ఆ ప్రమాదం జరిగిందని చెబుతుంటారు.

అలాగే 2009లో విలియమ్ గర్ల్ ప్రెండ్ గా ఉన్న సమయంలో కేట్ టెన్నిస్ ఆడుతున్న ఫోటో ఒకటి ప్రచురించి ఓ మీడియా ఏజెన్సీ విమర్శలు ఎదుర్కోగా, ఆపై 5000 పౌండ్ల నష్టపరిహారంతో ఆ వివాదం సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kate Middleton Topless  France court  

Other Articles