సచిన్ కారు రోడెక్కకుండానే పెంట పెంట చేస్తోంది | Tripura ministers fire on Deepa karmakar

Tripura ministers fire on deepa karmakar

Tripura govt Deepa Karmakar, Deepa Karmakar Tripura roads, Tripura Roads damaged

Tripura govt fire on Deepa Karmakar over damaged roads comments.

ఆమె కారు పెంట పెంట చేస్తోంది

Posted: 10/15/2016 10:48 AM IST
Tripura ministers fire on deepa karmakar

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుమతిగా ఇచ్చిన సచిన్ ఇచ్చిన కారును తిరిగి ఇచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన దీపాపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలని సూచించింది. త్రిపుర రహదారులు ఖరీదైన కార్లు తిరిగేందుకు అనువుగా లేవని, ఇక్కడ సర్వీస్ సెంటర్లు కూడా లేకపోవడంతో తనకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వెనక్కి ఇచ్చేయనున్నట్టు దీప ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కారును తీసుకుని ఆమె అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తానని సచిన్ సన్నిహితుడు చాముండీ ప్రకటించినట్లు ఓ వార్త వచ్చింది. అయితే అలాంటి స్టేట్ మెంట్ తాను ఇవ్వలేదంటూ ఆయన ప్రకటించడంతో ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరింది. అసలు ఆ ప్రకటన వెనుక ఉంది ఆమె అని తెలియటంతో త్రిపుర ప్రభుత్వం గుస్సాతో ఉంది.

త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర విదేశీ ప్రముఖుల కార్లు తిరుగుతున్నాయని, వాటికి లేని ఇబ్బంది ఆమెకు ఎలా వచ్చిందని మంత్రి బాదల్ ప్రశ్నించారు. రోడ్లు బాగోలేవంటూ రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మరో మంత్రి మాణిక్ దేవ్ అన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెపైన విమర్శలు చెలరేగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tripura  Gymnastics  Deepa Karmakar  Roads  

Other Articles