పోస్టాఫీసులకు పునర్ వైభవం.. క్యూ కట్టనున్న ప్రజలు Post offices to start selling pulses at subsidised rates

Post offices to start selling pulses at subsidised rates

consumer affairs secretary, Hem Pandey, Central government, subsidised rates, Post offices, Gangajal, Pulses, India, Business

To ensure that there is no shortage of pulses during the ongoing festival season, the Central government decided to utilise post offices across the country to sell pulses at the subsidised rates.

పోస్టాఫీసులకు పునర్ వైభవం.. క్యూ కట్టనున్న ప్రజలు

Posted: 10/15/2016 08:34 AM IST
Post offices to start selling pulses at subsidised rates

కారియర్ రంగప్రవేశం చేయడం, అ తరువాత వేగంగా ఉత్తరాలను గమ్యస్థానాలకు చేర్చడంతో రమారమి 50 శాతం మేర కుంగిపోయిన పోస్టల్ శాఖ.. ఆ తరువాత ఈ మెయిల్స్ రంగప్రవేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోయే స్థాయికి దిగజారింది. అయితే తాజాగా కేంద్రం తీసుకోనున్న నిర్ణయంతో మళ్లీ పోస్టాఫీసుల వద్ద కస్టమర్లు క్యూ కట్టాల్సిన పరిస్థితి రానుంది. ఎందుకలా అలాంటి ఏ నిర్ణయం కేంద్రం తీసుకుంది అనేగా మీ సందేహం. ప్రస్తుతం గంగాజలాన్ని అందిస్తున్న పోస్టాఫీసులు ఇక నుంచి మరికొన్న సరుకులను కూడా అందించనున్నాయి.

పోస్టాఫీసులు కేంద్ర నిర్ణయంతో చవక ధరల దుకాణాలుగా రూపాంతరం చెందనున్నాయి. అదేంటి అంటే పోస్టుఫీసుల్లో రాయితీపై పప్పు దినుసులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. మరో రెండు వారాల్లోనే ఈ ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడామని, వారు అంగీకరించారని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే తెలిపారు.

పప్పు దినసుల ధరలు అకాశాన్ని అంటుతుండగంతో ప్రజలకు రాయితీపై వాటిని పోస్టాపీసుల ద్వారా అందిస్తామని తెలిపారు. ముందుగా, శనగపప్పుతో పాటు మరిన్నీ పప్పు దినసులను అందిస్తామన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఔట్‌లెట్లు లేకపోవడంతో ప్రజలకు నిత్యావసరాలు అందడం లేదని, పోస్టాఫీసులు ప్రతీ గ్రామంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హేమ్‌పాండే వివరించారు. మరికొద్ది రోజుల్లోనే పప్పుల ప్యాకెట్లను పోస్టాఫీసుల నుంచి ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Post offices  Gangajal  Pulses  India  Business  

Other Articles