మాథ్యూ హరికేన్ ధాటికి 238 మంది దుర్మరణం | At least 283 people killed Hurricane Matthew devastation

At least 283 people killed hurricane matthew devastation

At least 238 people killed Hurricane Matthew, Hurricane Matthew updates, Hurricane Matthew, Hurricane Matthew america, Hurricane Matthew Haiti, Hurricane Matthew destruction, Hurricane Matthew devastation, 283 people killed Hurricane Matthew

At least 283 people killed Hurricane Matthew devastation.

ITEMVIDEOS:మాథ్యూ దెబ్బకి భారీగా ప్రాణ నష్టం

Posted: 10/07/2016 09:28 AM IST
At least 283 people killed hurricane matthew devastation

అమెరికా భయం గుప్పిట్లో గజగజ వణికిపోతుంది. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కారణం ఏ ఉగ్రవాద బెదిరింపో కాదు. ప్రస్తుతం అక్కడ అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ వణికిస్తోంది. గంటలకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటంతో భారీగా ప్రాణ మరియు ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే వెస్టిండీస్ లోని హైతీలో సుమారు 336 మంది దేశపౌరులను బలితీసుకున్న ఈ తుఫాను వేలాది మందిని నిరాశ్రయులను కూడా చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్లోరిడా వైపు అది దూసుకువస్తుందని తెలియడంతో అధ్యక్షుడు ఒబామా అధికారలను అప్రమత్తం చేశారు. తక్షణ సాయం అందించేందుకు వీలుగా విపత్తు అధికారులను కూడా రంగంలోకి దిగాలని అయన అదేశించారు. హైతీలో మిగిల్చిన విషాదం నేపథ్యంలో ఫ్లోరిడా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

హైతీలో బలమైన ఈదురు గాలులు వీయడంతో... భారీ నష్టం సంభవించింది. చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. మాథ్య వల్ల వెస్టిండీస్ వ్యాప్తంగా 336 మంది అసువులు బాయగా, ఒక్క హైతీలోనే 286 మందిని మత్యువు కబళించడం పరిస్థితి తీవ్రతను తెలియపరుస్తుంది. నిలువ నీడ లేకపోవటంతో ప్రజలంతా చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. తన జీవితంలో ఇంత భయంకరమైన హరికేన్ ను చూడలేదని ఆ దేశ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి స్వయంగా చెప్పారంటే... దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ హరికేన్ దెబ్బకు హైతీలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలను సైతం ఆదివారానికి వాయిదా వేశారు.

 

ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. సౌత్ క‌రోలినా, జార్జియా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. హ‌రికేన్ వెళ్తున్న దిశ‌లో ఉన్న ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఆదేశించారు. మరో రెండు రోజులపాటు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం సమీపించే కొద్దీ హరికేన్ తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ హరికేన్ ప్రభావంతో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీర ప్రాంతం మొత్తం అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 ల‌క్ష‌ల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు విపత్తును ఎదుర్కునేందుకు అంతా సిద్ధంగా ఉండాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hurricane Matthew  Haiti  Florida  

Other Articles