అమ్మ ఫోటోతో నీచమైన పనులు | TN CM Jayalalitha's ICU image fake

Tn cm jayalalitha s icu image fake

Jayalalitha's ICU image fake, TN CM Fake Image, Jayalalitha's ICU image Original, Peru Hospital Image for Jayalaitha, Website cheat with Jayalalitha's Fake Pic

Tamil Nadu CM Jayalalitha's ICU image fake.

అమ్మ ఫేక్ ఫోటోతో బకరాలను చేశారంట!

Posted: 10/05/2016 01:36 PM IST
Tn cm jayalalitha s icu image fake

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందని అపోలో ఆస్పత్రి వర్గాలు చెబుతుండటంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో, ఇంకోపక్క అభిమానుల్లో కాస్త టెన్షన్ చల్లారింది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమె షుగర్ లెవల్ మాములు స్థాయికి వచ్చిందని వైద్యులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమ్మ ఆరోగ్యంపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలు సైతం కిక్కురుమనకుండా కూర్చున్నాయి.

మరోపక్క అమ్మ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు, కథనాలు ప్రచురితం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఐసీయూ ఫోటో అంటూ ఒకటి, ఆడియో క్లిప్ అంటూ వాట్సాప్, పేస్ బుక్ లో విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. అది అమ్మ గొంతు కాదని అన్నాడీఎంకే వర్గాలు ఇదివరకే ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫోటో కూడా ఫేక్ అంటూ సాక్ష్యాలతో సహా నిరూపించారు కొందరు. అదసలు ఇండియాకు సంబంధించిన ఫోటోనే కాదని, పెరు రాజధాని లిమాలో ఓ ఆస్పత్రిలో ఎవరో మహిళ ఫోటోను జయలలిత ఫోటోగా ప్రచారం చేశారని తెలుస్తోంది.

Jayalalitha Fake

ఆ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే గోడ మీద ఆస్పత్రి పేరు ఎస్‌సలుద్ తో ఉన్న ఓ ఫోటో ఉంది. అంటే ఆమెను ఐసీయూలో ఉంచినట్లు కలరింగ్ ఇచ్చిన ప్రబుద్ధులు పక్కనున్న ఆసుపత్రి లోగోను మార్చడం మర్చిపోయారు. అపోలో ఆస్పత్రిని కాస్త అలా మార్చేయటంతో దొంగలు దొరికిపోయారు. మరోవైపు రేటింగ్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే తగిన బుద్ధి చెప్పక తప్పదని ఆమె అభిమానులు సదరు వెబ్ సైట్లను హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalitha  Fake  ICU Image  Original Peru Hospital  

Other Articles