మూడేళ్ల చిన్నారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు | Minor boy sets 3 year old on fire in Hyderabad

Minor boy sets 3 year old on fire in hyderabad

Minor boy sets 3 year old on fire, Hyderabad Minor fire, 3 year old on fire in Hyderabad, Kalapattar Fire Incident, Kalapattar Minor fire to Kid, Minor Bike Kid Petrol

Minor boy sets 3 year old on fire in Hyderabad.

దారుణం: పసిపిల్లాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు

Posted: 10/05/2016 12:37 PM IST
Minor boy sets 3 year old on fire in hyderabad

హైదరాబాద్ కాలాపత్తర్ లో దారుణం చోటుచేసుకుంది. బైక్ కు అడ్డుగా వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు ఓ బాలుడు. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ రహీమ్ నలుగురి కొడుకుల్లో చిన్నవాడైన మహ్మద్ అలీ షేయిర్ సోమవారం మధ్యాహ్నాం స్నేహితులతో ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ 16 ఏళ్ల బాలుడు బైక్ మీద అటుగా వచ్చాడు. పిల్లలు బైక్ కి అడ్డంగా ఉండటంతో జరగమని చెప్పాడు. వారికి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోయారు. దీంతో ఆ బాలుడు తన వెంట ఉన్న పెట్రోల్ తీసి అలీ మీద పోశాడు. ఆ పిల్లాడు తనకేం అర్థం కాక నవ్వుతుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడు నిప్పటించేశాడు.

దీంతో మిగతా పిల్లలు అరవటంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చిన రహీమ్ మంటలార్పి పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు పిల్లాడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు చెబుతున్న కథనాలు మరోలా ఉన్నాయి. మైనర్ బాలుడు పెట్రోల్ బాటిల్ తో ఆడుతుండగా పొరపాటున అలీపై పడి ఈ ప్రమాదం జరిగిందని కాలపత్తర్ ఎస్సై శ్రవణ్ కుమార్ చెప్పటం విశేషం. ఘటనపై ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి కలుగజేసుకోవటంతో దర్యాప్తు కోసం ఉన్నతాధికారులు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minor  Bike  Kid  set  Fire  

Other Articles