మహారాష్ట్రలో వా.. నరడు, ఆపరేషన్ చేసి తోక తొలగింపు | Nagpur boy 18 CM tail removed after Surgery

Nagpur boy 18 cm tail removed after surgery

Nagpur boy 18 CM tail, Man Tail Surgery in India, Indian Man with Huge Tail, Tail Surgery, Tail Boy in Nagpur, Nagpur Boy Tale Story, 18 CM tail

Nagpur boy 18 CM tail removed after Surgery.

అతగాడి తోకను ఆపరేషన్ చేసి తీసేశారు

Posted: 10/05/2016 11:04 AM IST
Nagpur boy 18 cm tail removed after surgery

జన్యుపరమైన లోపాల వల్ల ఒక్కోసారి మనిషి శరీరంలో వింత వింత పరిణామాలు చోటుచేసుకుంటాయి. అలాగే ఇక్కడో వ్యక్తికి తోక మొలిచింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 18 సెంటీమీటర్లు పెరిగింది. తోకతో నరకం చూసిన అతనికి ఎట్టకేలకు ఆపరేషన్ చేసి విముక్తి కలిగించారు డాక్టర్లు.

మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఒక వ్యక్తి జన్యుపరమైన లోపం కారణంగా వీపు వెనుక తోకతో జన్మించాడు. అతని వయసుతో పాటు తోక కూడా పెరిగింది. ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు కాగా, అతని తోక పొడవు 18 సెంటీమీటర్లు. ఈ తోక కారణంగా వెన్నుముక నొప్పితో బాధపడుతుండే వాడు.

ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు గత వారం నాగపూర్ లోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువకుడిని పరిశీలించిన ముగ్గురు వైద్యులతో కూడిన బృందం అతనికి శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. ఈ సందర్భంగా యువకుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, పుట్టుకతోనే తమ కుమారుడికి తోక వచ్చిందని, వైద్యులను సంప్రదించే విషయంలో కొంత నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. అయితే, అతని వయసుతో పాటు తోక కూడా పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే వైద్యులను సంప్రదించామన్నారు.

ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ అని, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్జరీ ముగించామని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఆపరేషన్ నిర్వాహకుడు గిరి వివరించారు. మానవుల్లో ఇలాంటి సమస్య చాలా అరుదుగా వస్తుంది. కానీ, ఇప్పటివరకు ఇంత పెద్ద తోకను తొలగించడం ఇదే మొదటిసారని ఆయన తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో మూత్ర సంబంధిత వ్యాధులతోపాటు, ఒక్కోసారి కాలు చేతులు పడిపోవటం కూడా సంభవిస్తుందని వివరించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagpur Boy  Tail  Operation  

Other Articles