ప్రముఖ సినీయర్ నటుడు కన్నుమూత Lions stray into residential area in Gujarat's Junagadh

Veteran tamil actor passes away

lions on road, lions walking on road video, video lions on road, junagadh district lions spotted, lions spotted in junagadh district, gir national park, gir national park lions, trending video, viral video

Veteran Tamil actor and dubbing artiste K N Kalai (84) passed away due to age-related illness here last night. He is survived by his wife and two sons.

ప్రముఖ సినీయర్ నటుడు కన్నుమూత

Posted: 10/02/2016 06:34 PM IST
Veteran tamil actor passes away

తమిళ చిత్ర రంగానికి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు కేఎన్.కాళై(84) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. తమళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, ఎస్ ఎస్ రాజేంద్రన్ వంటి ప్రముఖ అగ్రనటులతో నటించిన కాళై తమిళచిత్ర రంగంలో వివిధ పాత్రల్లో 200 చిత్రాలకు పైగా నటించారు. కేఎన్.కాళై అసలు పేరు కాళీశ్వరన్. తంజావూర్ జిల్లా కోవలడి గ్రామానికి చెందిన ఈయన తొలి రోజుల్లో దేవి నాటకసభ డ్రామా ట్రూప్‌లో రంగస్థల నటుడుగా కొనసాగారు.

నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ప్రవేశించిన ఆయన సినీ రంగ ప్రవేశానికి ముందు 10 వేలకు పైగా నాటకాలలో నటించి ఘనత వహించారు, ఈయన డబ్బింగ్ కళాకారుడు కూడా.వెయ్యి చిత్రాలకు తన గొంతును అరువిచ్చారు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ వేటగాడి వేషంలో కనిపించిన ప్పుడు నేపథ్యంలో రాజాధిరాజ రాజగంభీర అనే మాటలు వినిపిస్తాయి. శశికుమార్ హీరోగా నటించిన కిడారి చిత్రంలో ఆయన చివరసారిగా కనిపించారు. ప్రస్తుతం కాళేశ్వరన్ నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు,
 
రాష్ట్రప్రభుత్వ కలైమామణి అవార్డుతో పాటు నడిగర్‌సంఘం అందించిన కళెసైల్వం అవార్డు, మలేషియా ప్రభుత్వం చేత నాటక కావలన్ వంటి పలు అవార్డులు కాళైను వరించాయి. నడిగర్ సంఘం కోశాధికారిగానూ, ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. స్థానిక తే నాంపేటలో నివశిస్తున్న కేఎన్.కాళై భౌతిక కాయానికి నటుడు శరత్‌కుమార్, రాధారవి, దర్శకుడు కేఆర్.సెల్వరాజ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కేఎన్.కాళైకి భార్య టీకే.వసంత, కొడుకులు రాజు,రఘునాథన్ ఉన్నారు. కేఎన్.కాళై భౌతిక కాయానికి ఆదివారం స్థానిక ట్రిప్లికేన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lions  gujarat villages  gir national park  junagadh district  gujarat  

Other Articles