జబ్బుతో రియా నగ్నంగా మారిపోయింది | Naked bird with rare illness captures hearts

Naked bird with rare illness captures hearts

Naked Bird, Rhea Naked Bird, Rhea with rare illness captures hearts in Boston, Naked bird Rhea with rare illness, Bird with Rare illness, Naked bird Rhea, Bird with out Feathers, her feather follicles and causes her to live life naked

Naked bird Rhea with rare illness captures hearts in Boston.

ఈ బుల్లిపిట్టను చూస్తే గుండె బరువెక్కడం ఖాయం

Posted: 09/22/2016 03:08 PM IST
Naked bird with rare illness captures hearts

ఏ జీవి అయినా దాని సహాజ గుణంకి భిన్నంగా పుడితే భగవంతుడి తప్పుగా, కర్మ ఫలితంగా, అసలు దాన్నో పెద్ద వింతగా ప్రచారం చేసే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అయితే జెనెటిక్ లోపంతో జరిగే ఇలాంటి వాటిని చూసి అయ్యో పాపం అనుకోవటం తప్పించి ఏం చేయలేం అన్న విషయం వారికి కూడా తెలుసు. ఇక్కడ అలా పుట్టిన ఓ బుల్లి పిట్టను చూస్తే ఎవరికైనా కాస్త మనస్సు చలించాల్సిందే.

బోస్టన్ ని చెందిన రియా నగ్న పిట్టగా పాపులర్ అయ్యింది. వయసు రెండేళ్లు. పీబీఎఫ్ డీ అనే వ్యాధితో బాధపడుతోంది. దీనిప్రకారం ఈకలు లేకుండానే రియా పుట్టిందన్నమాట. అంతేకాదు ఆ రోగంతో పాపం దాని రెక్కలు కూడా కదల్లేవు. కాకపోతే కాళ్లతో అటు ఇటు పరిగెత్తగలదు. 23 ఏళ్ల ఇసాబెల్లా ఎసెనమాన్న్ అనే యువతి దీనిని పెంచుకుంటోంది. ఈకలు లేకపోవటంతో వెచ్చదనం కోసం రియో సైజ్ కి ప్రత్యేకంగా స్వెట్టర్లు కూడా కుట్టించింది. పక్షుల్లో చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి ద్వారా రియా తన స్వేచ్చను అనుభవించలేకపోతుంది.

naked bird rhea

బోనులో ఉండటం రియాకి అస్సలు నచ్చదు. బయట తిరగటం, పరిగెత్తటం దానికి చాలా ఇష్టం. అన్ని పక్షుల ఇది కాదు అంటూ ఇసాబెల్లా చెబుతోంది. మరి దీనికి చికిత్స లేదా అంటే... ప్చ్.. పుట్టుకతో వచ్చిన ఈ వ్యాధి ఇక అంతేనంట. కాకపోతే ఏడాదికి ఒకసారి రక్తమార్పిడి మాత్రం తప్పక చేయించాల్సి ఉంటుందట. ప్రస్తుతం రియా సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీగా మారిపోయింది.

 

naked bird

Rhea naked bird

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naked bird  Rhea  Rare Illness  

Other Articles