వామ్మో వాన మళ్లీనా? | Heavy Rain Started Again in Hyderabad

Heavy rain started again in hyderabad

Heavy Rain Started Again in Hyderabad, Heavy Rain hits again, rains hits again, Floods in Hyderabad, Rain danger in Hyderabad

Heavy Rain Started Again in Hyderabad.

ITEMVIDEOS:భారీ వర్షంతో భాగ్యనగరం గజగజ

Posted: 09/22/2016 02:23 PM IST
Heavy rain started again in hyderabad

మూలిగే నక్కపై తాటిపండు పడుతోంది. గత నాలుగు రోజులుగా కురిసిన నాన్ స్టాప్ వర్షాలకు నగరం కుదేలైపోయిన వేళ, కోలుకోక ముందే మరోసారి భారీ వర్షం భయపెడుతోంది. తాజాగా గురువారం మధ్యాహ్నం పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ముషీరాబాద్, మూసాపేట్, బంజారాహిల్స్, తార్నాక, బర్కతపురా, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, నిజాంపేట్, మియాపూర్, ఉప్పల్, మాదాపూర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపుతన్నాడు. మొన్న కురిసిన భారీ వర్షానికి భయకంపితులైన నగర ప్రజలు నిన్న వర్షం తెరపివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికే వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలో భారీగా నీరు చేరింది. పలు చోట్ల ఉన్న చెరువులు నిండు కుండలా మారాయి. తాజా వర్షంతో నగరంలోని రహదార్లు చెరువులుగా మారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట బంగారీ లేఅవుట్ లో నీట మునిగిన అపార్ట్‌మెంట్స్‌లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో దిక్కు తోచని స్థితిలో స్థానికులు ఉన్నారు. మళ్లీ ఇప్పుడు భారీ వర్షం ముంచెత్తడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

 

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తిరిగి వర్షం మొదలైంది. నాంపల్లి, కోటి, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, జీడిమెట్ల, ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్ గిరి, లాలాపేట, తార్నాక, ఉప్పల్, సరూర్ నగర్, బంజారాహిల్స్, మాదాపూర్, చార్మినార్, చంపాపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో మరోసారి రోడ్లపైకి నీరు చేరగా, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ వర్షపు నీటిలో అధికభాగం ఇప్పటికే నిండుకుండగా ఉన్న హుస్సేన్ సాగర్ కు చేరుతుండగా, ఔట్ ఫ్లోను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ నీరు లుంబినీ పార్కులోకి చొచ్చుకొచ్చింది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  heavy rain  traffic  floods  

Other Articles