చుక్ చుక్ బండి ఇక లేదు | Railway budget scrapped merged with general budget

Railway budget scrapped merged with general budget

Railway budget scrapped, Railway budget RIP, jaietly On Railway budget scrap, Railway budget is no more, Indian Railway Budget

Railway budget scrapped merged with general budget, Union Minister Arun jaietly announced after Cabinet Meeting.

చుక్ చుక్ సాంప్రదాయానికి చెక్ పడింది

Posted: 09/21/2016 03:11 PM IST
Railway budget scrapped merged with general budget

బ్రిటీష్ కాలం నుంచి మొదలైన సాంప్రదాయానికి ఎన్టీయే ప్రభుత్వం మంగళం పాడింది. గడచిన 92 సంవత్సరాల నుంచి సాధారణ బడ్జెట్ కు ముందు పార్లమెంట్ లో చేసే రైల్వే బడ్జెట్ సందడి ఇకపై కనిపించదు. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కూడా కలిపేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మీదట ఒకే బడ్జెట్ ఉంటుందని కేబినెట్ మీటింగ్ తర్వాత ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధార‌ణ బ‌డ్జెట్‌లోని ప్ర‌ధాన రంగాల్లో రైల్వేని కూడా చేరుస్తారు. దీంతో రైల్వేస్ క‌న్వెన్ష‌న్ క‌మిటీ కూడా ర‌ద్ద‌వుతుంది. రైల్వే రెవెన్యూ లోటు, మూల‌ధ‌న వ్య‌యాన్ని ఆర్థిక శాఖ‌కు బ‌దిలీ చేస్తారు. బడ్జెట్ లో ఉండే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను కూడా విలీనం చేసినట్లు జైట్లీ వెల్లడించారు

ఆదాయం తగ్గి, మూలధన వ్యయాలు పెరిగాయన్న కారణాలు చూపుతూ, రైల్వే శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని గత కొద్ది కాలంగా కేంద్రం ప్రతిపాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1న రైల్వే, కేంద్ర బడ్జెట్ లను కలిపి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక రెండు బడ్జెట్ల విలీనానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి వుంది. జనవరి 25లోగా ఈ పని పూర్తయితేనే, ఫిబ్రవరి 1న సంయుక్త బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చే వీలుంటుంది.

అలాగే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే తేదీల మార్పున‌కూ కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జ‌న‌వ‌రి 25లోపే బ‌డ్జెట్ సెష‌న్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో మూడు వారాల ముందుగానే అంటే అక్టోబ‌ర్ మొద‌టి వారం నుంచే బ‌డ్జెట్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. డిసెంబ‌ర్ 25లోపు బ‌డ్జెట్‌పై భాగ‌స్వాములంద‌రితోనూ సంప్ర‌దింపుల ప్ర‌క్రియ ముగుస్తుంది. జ‌న‌వ‌రి 7 లోపు గ‌ణాంకాల శాఖ జీడీపీ అంచ‌నాలు కూడా పూర్త‌వుతాయి.

పుట్టుపూర్వోత్తరాలు

  • 1920లో భారత్ లో రైల్వే ఆధునీకరణ, అభివృద్ధి కోసం బ్రిటీష్ ఆర్థిక నిపుణుడు విలియం అక్ వర్త్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పడింది. సుమారు 4 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం అనంతరం సాధారణ బడ్జెట్ నుంచి దానిని వేరు చేసి, ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఏకధాటిగా 92 సంవత్సరాల పాటు ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.

Railway Budget

Railway budget RIP

  • మొట్టమొదటిసారిగా 1994, మార్చి 24న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

  • ఇప్పటివరకు అత్యధిక సార్లు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘటన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ది. 2004 నుంచి 2009 ఆరేళ్లపాటు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.

  • ఇక ఆయన తర్వాత ఆ రికార్డు తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇన్నేళ్లలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రి ఆమె కావటం విశేషం. ఇక్కడో ఇంకో ప్రత్యేకం ఏంటంటే... యూపీఏ మరియు ఎన్టీయే రెండు ప్రభుత్వాల హయాంలో ఆమె రైల్వే మంత్రిగా పని చేయటం, బడ్జెట్ ప్రవేశపెట్టం జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railway budget  scrap  General Budget  

Other Articles