వెంకయ్యపై సెటైర్లతో మొదలైన పవన్ ప్రసంగం | pawan satires on venkaiah naidu in kakinada meeting

Pawan satires on venkaiah naidu in kakinada meeting

Seema Andhrula Atma Gourava Sabha, pawan speech at kakinada meeting, Pawan satires on venkaiah in kakinada meeting, Janasena Kakinada meeting, Janasena kakinada athma gaurava Sabha

pawan satires on venkaiah naidu in kakinada meeting.

ఆత్మగౌరవ సభ హైలెట్స్ 1: మీకోసమే వచ్చాను... వెంకయ్యపై సెటైర్లతో మొదలైన పవన్ ప్రసంగం

Posted: 09/09/2016 04:03 PM IST
Pawan satires on venkaiah naidu in kakinada meeting

కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జరుగుతున్న 'సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ' ప్రారంభమైంది. ప్రాంగణానికి చేరుకోగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైక్ అందుకుని పోలీస్ శాఖకు సహకరించాలని అభిమానులను ఆయన కోరారు. బారికేడ్లు తోసుకుని ముందుకు వచ్చేవారు, గోడలు, మేడలు, స్తంభాలు ఎక్కిన వారందర్నీ ఉద్దేశించి, 'మీరు పడిపోతే నాకు కన్నీళ్లు వస్తాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి' అని సూచించారు. 'మన పోలీసు శాఖకు సహకరిద్దామ'ని ఆయన సూచించారు. 'మీ కోసమే వచ్చాను, మన హక్కుల సాధన కోసమే వచ్చాను...మీతో మాట్లాడుతాన'ని ఆయన తెలిపారు.

ఇక అందరూ ముందుగా ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్ ప్రసంగం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని స్పష్టం చేసిన బీజేపీ వైఖరిపై నిప్పులు చెరుగుతూనే ప్రారంభమైంది. తొలుత అభిమానులతో "భారత్ మాతాకీ జై" అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయించిన ఆయన, తన పదునైన వాగ్బాణాలను తొలుత వెంకయ్యపై ఎక్కుపెట్టారు. "మాననీయ వెంకయ్యనాయుడూ జీ... ఆప్ ఔర్ ఆప్ కీ బీజేపీ పార్టీ నే మిలికే దోనో హాతోంమే లడ్డూ... మోతీ చూర్ కా లడ్డూ దియా" (వెంకయ్యనాయుడు గారూ... మీరూ మీ బీజేపీ పార్టీ కలసి మా రెండు చేతుల్లో బూందీ లడ్డూ పెట్టారు) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మూడేళ్ల నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం అంటూ తీపికబురు వస్తుందని ఆశగా చూస్తుంటే రెండు లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటారా? లడ్డూ తింటారా? అంటున్నారు. ఇక సహించేది లేదు అంటూ ఆవేశపూరితంగా పవన్ ప్రసంగం కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  speech  kakinada  meeting  

Other Articles