ఏపీ ప్యాకేజీ విలువ 2.25 లక్షల కోట్లు | Venkaiah Naidu says about Rs 2.25 lakh crore assistance for Andhra Pradesh

Venkaiah naidu says about rs 2 25 lakh crore assistance for andhra pradesh

Venkaiah Naidu on AP package, Venkaiah Naidu details on package, Rs 2.25 lakh crore assistance for Andhra Pradesh, AP special package, Andhra Pradesh package full details

Venkaiah Naidu says about Rs 2.25 lakh crore assistance for Andhra Pradesh package.

ప్యాకేజీయే అంతకు మించి అంటున్న వెంకయ్య

Posted: 09/09/2016 08:51 AM IST
Venkaiah naidu says about rs 2 25 lakh crore assistance for andhra pradesh

ఏపీకి కేంద్రం ప్రకటించిన స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ విలువ రూ.లక్షా యాభై వేలు కోట్లు కాదట. ఆ ప్యాకేజీ విలువ అక్షరాలా రూ.2,29,398 కోట్లని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన నవ్యాంధ్రను కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం చట్టబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి ఉంది. హోదా వల్ల ఆర్థిక ప్రయోజనాలే కలుగుతాయి. అవే ప్రయోజనాలను మరో మార్గంలో కల్పిస్తే అభ్యంతరం ఏమిటి?’ అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశ్నించారు.హోదా సెంటిమెంటుగా మారిందన్న అంశంపై స్పందిస్తూ.. సెంటిమెంటుతో అభివృద్ధి సాధ్యం కాదని, నిధులతోనే అది సాధ్యమని పేర్కొన్నారు.

ఏపీకి కేంద్రం అందిస్తున్న ప్రాజెక్టుల విలువ రూ.2 లక్షల కోట్లకు పైమాటేనని చెప్పారు. ఇప్పటి వరకు ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, పనులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యరూపం దాల్చే అవకాశమున్న ప్రాజెక్టులు, ఎంవోయూల విలువ రూ.2,29,398 కోట్లని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.1,62,878.08 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టామని, పనులు జరుగుతున్నకొద్దీ మిగతా నిధులు వస్తుంటాయని అన్నారు. హోదా బదులు రాష్ట్రానికి అదనంగా విదేశీ రుణాలు వస్తాయని వాటిని కేంద్రమే చెల్లిస్తుందని వివరించారు. 2015 నుంచి ఐదేళ్లపాటు రెవెన్యూ లోటు భర్తీకి 22,113 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఐదేళ్లపాటు ఏటా కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.41,364 కోట్లు వస్తుందని, ఐదేళ్లకు ఈ మొత్తం రూ.2,06,819 కోట్లుగా లెక్క తేలుతుందని వివరించారు.ఈ మేరకు ప్యాకేజీ లెక్కలను సవివరంగా వెల్లడించారు.

ఆయన చెప్పిన లెక్కలిలా ఉన్నాయి. 

అంశం నిధులు (కోట్లలో)
పెట్రోలియం ప్రాజెక్టులు - 52,120
జాతీయ రహదారులకు - 65,000
పోలవరం ప్రాజెక్టు - 15,850
విద్యా సంస్థలకు - 5,190
జాతీయ సంస్థలకు - 1,030
రక్షణ సంస్థలకు - 6,266
పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం - 4,110
నౌకాయాన ప్రాజెక్టులు - 3,465
ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు - 1,740
విద్యుత్ ప్రాజెక్టులకు - 328
ఎయిర్ పోర్టులకు - 303
రైల్వే ప్రాజెక్టులకు - 3,808
వాణిజ్యం, పరిశ్రమలకు - 3,078
ఐటీ, టెలి కమ్యూనికేషన్లకు - 357
పర్యాటక రంగానికి - 131
ఇతరత్రా - 102
మొత్తం - 1,62,878
(పైవన్నీ ఇప్పటిదాకా చేపట్టిన పనులకు సంబంధించిన కేటాయింపులు)
ఇక కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల వివరాలిలా ఉన్నాయి.
ఆర్ఐఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ - 38,500
విశాఖలో మెడ్ టెక్ పార్కుకు - 20,000
అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం - 7,500
ఏపీ ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణానికి - 520
మొత్తం - 66,520
ఇప్పటిదాకా చేపట్టిన ప్రాజెక్టులకు 1,62,878 కోట్లు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇవ్వనున్న రూ.66,520 కోట్లు మొత్తం కలుపుకుని రూ.2,29,398 కోట్లని వెంకయ్య లెక్కలు చెప్పారు.

పంచెపై మళ్లీ పంచ్...

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే తనను ఏపీలో అడుగుపెట్టనివ్వనంటూ ఇటీవల ఒకాయన తనపై వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా సీపీఐ నారాయణ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ‘ఆ మధ్య ఒక మహానుభావుడు.. వెంకయ్యనాయుడిని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వనన్నాడు. పంచె.. పంచెలూడదీస్తాడట. పంచెలూడదీసి చూడాల్సిన ఆసక్తి ఆయనకేంటో నాకర్థం కాలేదు! ఆయనకు లేవా పంచెలు, ఏంటో నాకర్థం కాలేదు! రాజకీయాల్లో ఉండి, రాజకీయ స్థాయి మరచి ఇంత అసభ్యకరమైన పదజాలం వాడారు. వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాల్సి ఉంటుంది’ అని వెంకయ్యనాయుడు ఆవేశంగా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  AP package  RS 2.25 lakhs  

Other Articles