Srinagar police officer ties knot with PoK girl amid Kashmir unrest

Srinagar police officer marries girl from muzaffarabad

Jammu and Kashmir, JK si Owais Geelani, pakistan bride, Faiza Geelani, Karnah town, kashmir, srinagar police officer marries pok girl, kashmir unrest, kashmir curfew, kashmir violence, kashmir news, india news

The groom's father, who hails from Karnah town near the Line of Control (LoC), said it was his longing to visit members of his divided family - due to the 1947 war between India and Pakistan.

దేశాంతర వివాహం: పాక్ యువతిని పరిణయమాడిన జమ్మూ ఎస్ఐ

Posted: 09/03/2016 12:10 PM IST
Srinagar police officer marries girl from muzaffarabad

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్న నేటి కాలంలో దేశాంతర వివాహాలు కూడా జరగడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని మెచ్చి, నచ్చి ఎందరో విదేశీ వనితలు భారతీయ యువకులను వివాహాలు చేసుకున్నారు. పలువరు హైందవ దర్మాన్ని అనుసరించగా, మరికోందరు వారి మతాలనుచారం ప్రకారం పరిణయం చేసుకున్నారు. కాగా ధాయాది దేశం పాకిస్థాన్ లోని యువతని ఓ పోలీసు అధికార పెళ్లాడమే సంచలనంగా మారింది.

ఓ పక్క కశ్మీర్ లోయలో పాకిస్థాన్ అనుకూల నిరసనలు గత రెండు నెలలుగా కొనసాగుతుండగా.. శ్రీనగర్ కు చెందిన ఓ యువ  పోలీస్ అధికారి.. పాక్ అమ్మాయిని పెళ్ళాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ ఒవైస్ జిలానీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ కు  చెందిన ఫైజా జిలానీని వివాహమాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆందోళనల నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు వధూవరుల దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కావాల్సి వచ్చింది.   

లోయలో దాదాపు రెండు నెలలపాటు అశాంతి నెలకొనడానికి తోడు.. నిరసనకారులు ఆగ్రహావేశాల్లో ఉండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో వివాహ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అయితే వధూవరులిద్దరూ దగ్గరి బంధువులే అయినా.. ఆ రెండు కుటుంబాలూ పాకిస్థాన్ విభజన సందర్భంలో విడిపోయాయి. అనంతరం శాంతి కారవాన్ పేరిట శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ మధ్య బస్ సేవలు ప్రారంభమవ్వడంతో.. వరుని తండ్రి షబీర్ జిలానీ.. 2014 లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తమ బంధువులను కలసి 'నిఖా' చేసుకున్నారు.

వివాహం కుదుర్చుకున్న అనంతరం అనేక మార్లు క్రాస్ లాక్ బస్సు రద్దు కావడంతో వివాహం కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇటీవల సదరు బస్ సర్వీసులను పునరుద్ధరించడంతో వధువు సహా ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు వచ్చి శ్రీనగర్ లోని ఓ హోటల్ లో  వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. సీనియర్ జిలానీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. దీంతో ఇస్లామాబాద్ నేషనల్ యూనివర్శిటీలో ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో  పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కుమార్తె.. ఫైజీ జిలానీకి, కశ్మీర్ లో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న.. తమ బంధువైన ఒవైస్ జిలానీతో..  వివాహం జరిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  JK si Owais Geelani  pakistan bride  Faiza Geelani  

Other Articles