Mother-son duo dodges bullet, fights off snatchers

Chain snatchers fire at and drag victim

police, chain snatchers, bullet, dragged, snatchers shot fire, mother and son escapes, lady teacher, uttar pradesh

A mother-son duo had a close shave when they resisted a snatching attempt, prompting one of the assailants to fire a shot at the woman. The incident took place near a bus stop at northeast Delhi's Khajuri Khas.

భరితెగిస్తున్న చైన్ స్నాచర్లు.. ఎదురుతిరిగితే కాల్పులే..!

Posted: 09/03/2016 01:43 PM IST
Chain snatchers fire at and drag victim

తెలుగు రాష్ట్రాలలో తమ ప్రతాపాన్ని చాటి.. పోలీసులకు సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్లు ఇప్పుడు తమ దృష్టిని ఏకంగా దేశరాజధానిపైకి మళ్లించారు. అయితే నేరాలకు పుట్టినిల్లుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ను అనుకుని వున్న ఢిల్లీలో తమ ప్రతాపాన్ని చాటేందుకు మరింతగా భరితెగించారు. ఎంతలా అంటే.. వాళ్లు వెంట పడినప్పుడు వీలైతే తప్పించుకోవాలి లేదా వాళ్లకు మన ఆభరణాలు సమర్పించుకోవాలి. అంతేతప్ప ఎదిరిస్తే ప్రాణాలకే ప్రమాదం చేకూరుతుంది. అదెలా అంటే తమ దోపిడికి అడ్డువచ్చినా.. ఎదురుతిరిగినా.. వారిపై స్నాచర్లు కాల్పులకు తెగబడతారు..

దేశ రాజధానిలో తల్లీకొడుకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈశాన్య ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో ఓ బస్టాపు వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తన ఆరేళ్ల కొడుకును స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్తూ బస్టాపు వద్ద వేచి ఉన్నారు. అంతలో ఇద్దరు యువకులు బైకు మీద వచ్చి, ఆమెను ఏదో అడ్రస్ అడిగారు. ఆమె వాళ్లకు ఆ అడ్రస్ చెప్పేలోగా వాళ్లలో ఒకడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ఆ యువకుడి చొక్కా పట్టుకుంది.

అతడు వెంటనే జేబులోంచి పిస్టల్ తీసి.. ఆమెవైపు కాల్చాడు. అదృష్టవశాత్తు ఆమె బుల్లెట్ తగలకుండా తప్పించుకుంది. అంతలోనే తుపాకి పేలిన శబ్దం విని అక్కడకు చుట్టుపక్కలవాళ్లు వచ్చి ఏం జరిగిందని గట్టిగా అడగడంతో.. ఆ యువకులు ఇద్దరూ గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్రంగా షాకైన సదరు మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, వాళ్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగు సభ్యులు అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. వాళ్లపై దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles