with two groups clash, will vijayawada dundi celebrations rock..?

Tdp mla bonda uma alleges threat to his life

vijayawada dundi ganesh celebrations creates fearce atmosphere as tdp mla bonda uma and industrilist koganti satyam groups clash for organising uphand

vijayawada dundi ganesh celebrations creates fearce atmosphere as tdp mla bonda uma and industrilist koganti satyam groups clash for organising uphand

కోగంటి సత్యం నన్ను చంపేస్తాడేమో: టీడీపీ ఎమ్మెల్యే

Posted: 09/03/2016 10:43 AM IST
Tdp mla bonda uma alleges threat to his life

విజయవాడ డూండి గణేశ్ సేవా సమితిలో పొడచూపిన విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. డూండీ సేవాసమితి మీద ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం వర్గాల మధ్య మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. డూండీ గణేశ్ సేవాసమితి గౌరవ అధ్యక్షుడిగా బోండా ఉమాకు ఎన్నుకోవడమే వివాదానికి అజ్యం పోసింది. ఈ వివాదాల నేపథ్యంలో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే తనకు ప్రాణభయం వుందని పేర్కొనడం, కోగంటి సత్యం మనుషులు తనను చంపుతారేమోనని భయాందోళన వ్యక్తం చేయడం వివాదానికి తారాస్థాయికి చేర్చింది.

ఈ వివాదాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయాలు ఒక్కసారిగా వేడక్కాయి. అంతేకాదు బోండా ఉమ పోలీసులుకు తన ప్రాణభయం వుందని పిర్యాుద చేయడంతో రంగంలోకి దిగిన సూర్యారావుపేట పోలీసులు కోగంటి సత్యంను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే సత్యం వర్గీయులు కూడా పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటు బోండా ఉమా వర్గీయులు కూడా పోలీసు స్టేషన్ వద్ద మోహరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు.

కాగా, ఉమా, సత్యం వర్గీయుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవడం, వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లడంతో అసలు ఈసారి డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు సక్రమంగా సాగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ గణేశ్ కమిటీ కోసం 8,500 కిలోల లడ్డుతో పాటు, వినాయకుడి చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కిలోల లడ్డూను తాము కానుకగా అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ యజమాని మల్లిబాబు ఇప్పటికే చెప్పారు. ఈలోపు ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dundi ganesh  vijayawada  celebrations  bonda uma  koganti satyam  groups clash  suryaraopet police  

Other Articles