క్యాబ్ డ్రైవర్లు రేప్ చేసి చంపేశారు | Girl gangraped in moving car in Kolkata dumped on roadside

Girl gangraped in moving car in kolkata dumped on roadside

Cab drivers rape, Kolkata cab drivers rape, Ola drivers rape and murder, kolkata rape and murder case, 12 old girl rape and kill

Girl gangraped in moving car in Kolkata dumped on roadside.

తల్లి ముందే కిడ్నాప్.. రేప్... మర్డర్

Posted: 08/31/2016 06:19 PM IST
Girl gangraped in moving car in kolkata dumped on roadside

ఎన్ని చట్టాలు చేసినా దేశంలో ఎక్కడో ఓ చోట ప్రతి రోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వుంటున్నాయి. మృగాళ్ల విరుచుకుపడుతున్నాపట్టించుకునే వారు కరువవుతున్నారు. తాజాగా దక్షిణ కోల్ కతాలో జరిగిన ఉదంతం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. రోడ్డు పక్కగా గుడిసె వేసుకుని జీవిస్తున్న కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలికను ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు కిడ్నాప్ చేసి, పైశాచికంగా అత్యాచారం, ఆపై హత్య చేశారు.

ఇంటి బయట ఉన్న బాలికను కారులో వచ్చిన ఇద్దరు నిందితులు లోపలికి లాక్కున్నారు. కాస్త దూరంగా ఉన్న ఆమె తల్లి కిడ్నాప్ జరగడాన్ని చూసి, స్థానికులను అప్రమత్తం చేస్తూ కుమార్తెను రక్షించేందుకు ఉపక్రమించేలోగా వారు ఆమెను ఎత్తుకెళ్లిపోయారు.

పార్క్ సర్కస్ ఫ్లై ఓవర్ పక్కనే కారునాపి, కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక గొంతునులిమి చంపి పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసి వెళ్లిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, చివరికి ఆ దుండగుల్ని వెంటాడి పట్టుకుని అరెస్ట్ చేశారు. వారిలో ఒక వ్యక్తి 'ఓలా' క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ముందు దుండగులిద్దరూ పీకలదాక మద్యం తాగినట్టు వారు వెల్లడించారు. ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata  girl  rape  murder  

Other Articles