తమిళనాడు గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు | Maharashtra Governor Ch Vidyasagar Rao additional for TamilNadu

Maharashtra governor ch vidyasagar rao additional for tamilnadu

No extension for Rosaiah, Rosaiah relieving from TN governor, Maharashtra Governor Ch Vidyasagar Rao, Vidyasagar Rao additional governor for TN, Vidyasagar Rao Tamil Nadu governor

Maharashtra Governor Ch Vidyasagar Rao additional for TamilNadu. No extension for Rosaiah.

రోశయ్య ప్లేస్ లో మరో తెలుగు వ్యక్తి

Posted: 08/31/2016 05:02 PM IST
Maharashtra governor ch vidyasagar rao additional for tamilnadu

తమిళనాడు గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ కేంద్రం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపధ్యంలో రోశయ్య స్థానంలో ఇన్ ఛార్జి గవర్నర్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా కర్ణాటక బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తి, ఆపై గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ పేర్లు గవర్నర్ రేసులో వినిపించాయి. ఇంకోవైపు రోశయ్య పదవీకాలాన్నే పొడిగించాలని కేంద్రానికి సీఎం జయలలిత విజ్నప్తి చేసింది. అయితే అవేం పట్టించుకోని సర్కార్ ఊహగానాలకు తెరదించుతూ విద్యాసాగర్ రావు కి ఇన్ ఛార్జ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. ఇక మధ్యప్రదేశ్ గవర్నర్ పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కొహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్ లను నియమించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  governor  K Rosaiah  relieving  Maharashtra  Governor  Vidyasagar Rao  additional incharge  

Other Articles