కశ్మీర్ అల్లర్లలో డబ్బు ఎలా సరఫరా అవుతుందంటే.. | Hawala money is pumped into Jammu through ladies dresses

Hawala money is pumped into jammu through ladies dresses

Jammu Kashmir Hawala money, Hawala Money in kashmir, woman smuggling money, insian woman smuggler, Woman smmugling, smuggling woman dress, money in woman dress

Hawala money is pumped into Jammu through ladies dresses.

అల్లర్ల కోసం అమ్మాయిల బట్టల్లో నోట్ల కట్టలు

Posted: 08/31/2016 04:03 PM IST
Hawala money is pumped into jammu through ladies dresses

జమ్ము కశ్మీర్లో దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు తగ్గు ముఖం పట్టేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోంటోంది. ఇదిలా ఉండగా వారిని ప్రోత్సహిస్తూ, మరిన్ని నిరసనలకు పురిగొల్పుతూ, వారికి లక్షలాది రూపాయలను వివిధ ఉగ్రవాద సంస్థలు ఎలా పంపుతున్నాయో నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇప్పటిదాకా నిరసనకారులకు హవాలా నిధులు అందుతుండటంపై మొత్తం ఆరు కేసులను నమోదు చేసిన పోలీసులు ఆ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఇందుకోసం యువతులను వాడుకుంటున్నట్లు వారు చెప్పారు. వారు ధరించే సల్వార్ కమీజుల లోపలి భాగాల్లో జేబులు కుట్టించి వాటిల్లో డబ్బు కట్టలను పెడుతున్నారని, దానిపై బురఖాలు ధరించే వారు అనుమానం రాకుండా డబ్బులను చేర్చాల్సిన చోటికి చేరుస్తున్నారని పోలీసు వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తోంది. యువతులను కొంత డబ్బు ముట్టజెప్పి, భారీ మొత్తంలో నగదును వారి దుస్తుల్లో సరఫరా చేస్తున్నారు. వీటిని కల్లోలిత ప్రాంతాలకు వెళ్తున్న యువతులు అక్కడి నేతలకు అందజేస్తుంటే, ఆ నేతలు వాటిని యువకులకు పంచి రెచ్చగొడుతున్నారు అని ఓ ఉన్నత అధికారి తెలిపారు. హవాలా డబ్బును తరలించేందుకు గ్యాస్ సిలిండర్లను కూడా వారు వాడుతున్నారని వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి కశ్మీర్ వేర్పాటు వాదుల ఖాతాల్లోకి ఈ డబ్బు వస్తోందని, ఆపై వారు నగదును యువకులకు పంచుతున్నారని వార్తలు వచ్చాయి. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ వంటి సంస్థలు శిక్షణ పొందిన మిలిటెంట్లను జమ్ములోకి చొప్పించి, వారి నాయకత్వంలో నిరసనలను పెంచుతున్నాయని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu Kashmir  Hawala Money  ladies dress  

Other Articles