ప్రశాంత్ కిషోర్ పై సంచలన ఆరోపణలు | Sushil Kumar Modi allegations on Prashant Kishor

Sushil kumar modi allegations on prashant kishor

Sushil Kumar Modi allegations on Prashant Kishor, Prashant Kishor bihar, Prashant Kishor bihar CM adviser, Prashant Kishor allegations

Sushil Kumar Modi allegations on Prashant Kishor.

జాబ్, జీతం ఓ చోట.. పని చేసేది ఇంకో చోట?

Posted: 08/31/2016 02:44 PM IST
Sushil kumar modi allegations on prashant kishor

ప్రశాంత్ కిషోర్ రెగ్యులర్ గా పొలిటికల్ అప్ డేట్స్ చూసే వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రధానిగా మోదీ, బీహార్ సీఎం పీఠంపై నితీశ్ లను కూర్చోబెట్టిన ఈ రాజకీయ వ్యూహకర్త, ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు. అయితే ఇప్పడు ఆయనపై సంచలన ఆరోపణలు చేశాడు బీహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ. 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ  కోసం నితీశ్ సర్కార్ ఖజానా నుంచి 9 కోట్లు అందజేసిందని ఆరోపించాడు.

మరి అంత సొమ్ము తీసుకుని బీహార్ ను వదిలి యూపీలో పని చేయటం ఏంటని సుశీల్ ప్రశ్నిస్తున్నాడు. తక్షణమే అతన్ని ముఖ్యమంత్రి వ్యక్తిగత సలహాదారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బృహత్తర బాధ్యతలను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. 1989 తరువాత తిరిగి కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టేందుకు తన టీమ్ తో నిత్యమూ శ్రమిస్తున్నారు. అందుకే, ప్రశాంత్ బీహార్ పనిని వదిలేసి కాంగ్రెస్ పని చేస్తున్నారన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ.

బీహార్ లో మహా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు టెక్ సాయం చేసిన ప్రశాంత్ ను నితీశ్ కుమార్ తన సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను నితీశ్ సర్కారు ప్రశాంత్ కే అప్పగించింది. అందుకు ఆయనకు ప్రతిఫలంగా రూ. 9.31 కోట్లను కూడా బీహార్ ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు వినిపించాయి. అయితే, నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ప్రశాంత్ ఆ రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. అటువంటి అతనికి వేతనమివ్వటం ఇప్పుడు చర్చకు దారితీసింది.

కాగా, సుశీల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలుస్తోంది. 9 కోట్ల సొమ్ము తీసుకున్నాడన్న ఆరోపణల్లో నిజం లేదని, ఈ మేరకు త్వరలో సుశీల్ కు నోటీసులు పంపనున్నట్లు సమాచారం అందుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prashant Kishor  Sushil kumar modi  9 crores  

Other Articles