Ramya says RSS played no role in the freedom struggle

Ramya criticises bjp s pseudo patriotism

congress former MP, sandalwood actress, Ramya, RSS, BJP, Freedom struggle, pseudo patriotism, mammoth Tiranga Yatra, bjp patriotism lessons

"The RSS did not have any role in the Indian freedom struggle and, in fact, may have been on the side of the British." says actor-turned-politician Ramya.

శత్రువులతో చేతులు కలిపిన వాళ్లనుంచి ‘దేశభక్తి’ పాఠాలా.?

Posted: 08/31/2016 01:28 PM IST
Ramya criticises bjp s pseudo patriotism

పాకిస్థాన్ లోనూ అక్కడి ప్రజలు మనలాగే బతుకుతున్నారని, మనం ఊహించుకున్నంతగా అక్కడ పరిస్థితులేమీ లేవని యావత్ భారతం నుంచి విమర్శలను ఎదుర్కోన్న కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య తనదైన శైలిలో మరోమారు విపక్షాలపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ వ్యాఖ్యల నేపథ్యంలో అమపై దోశద్రోహం కేసు విధించినా.. వెనక్కి తగ్గని అమె.. వసుధైక కుటుంబం పరమార్థాన్ని ముందుకు తీసుకువచ్చారు. దీనితో యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించాలని బీజేపి సహా ప్రజలందరూ అన్ని కులాలను, అన్ని మతాలను అన్ని ప్రాంతాలను సమానదృష్టితోనే చూడాలని అమె సూచించారు.

కాగా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపి సహా దాని అనుబంధ పక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అమెకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మద్దతుగా నిలిచిన రెండు రోజుల వ్యవధిలోనే అమె బీజేపి అర్ఎస్ఎస్ లపై విరుచుకుపడింది. దేశ స్వాతంత్ర్య సమరం చేసి.. భారత మాత బాసిన శృంఖాలాలను తెంచింది కాంగ్రెస్ అంటూ అమె నినదించారు. ఆ సమయంలో బ్రీటిష్ వారితో సాగుతున్న పోరులో కాంగ్రెస్
కార్యకర్తలు, నేతలు అసువులు బాసారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ దేశం ఒక్కటై పోరాడుతున్న వేళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నాయని ఆమె వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తున్న వేళ, బీజేపీ ఏమైపోయిందని, వీధుల్లో పోరాటాలతో స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ శ్రమిస్తున్న వేళ, బ్రిటీష్ వారితో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. అలాంటి వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది. తమకు అంటిన అఫఖ్యాతినిన ఎవరూ గమనించలేదని దానిని దూరం చేసకునేందుకు బీజేపి అర్ఎస్ఎస్ లు దేశభక్తి పాఠాలు వల్లిస్తున్నాయని అమె అరోపించారు. వారి దేశభక్తి మొత్తం మొసలి కన్నీరులాంటిదని వ్యాఖ్యానించారు. అయితే వారి నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని రమ్య అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles