మీడియా ప్రతినిధులను కాపాడిన నరేంద్ర మోదీ | Modi's Timely Alert Saves 4 Media Crew From Being Washed Away

Modi s timely alert saves 4 media crew from being washed away

Modi's Timely Alert Saves, modi saves 4 people, Modi's Timely Alert Saves 4 Media Crew, Modi Aji Dam opening, Modi warns media people

Modi's Timely Alert Saves 4 Media Crew From Being Washed Away.

ITEMVIDEOS:మోదీ టైమింగ్ నాలుగు ప్రాణాలు కాపాడింది

Posted: 08/31/2016 12:39 PM IST
Modi s timely alert saves 4 media crew from being washed away

వేసే ప్రతి అడుగులోనూ ప్రధాని నరేంద్ర మోదీది విలక్షణ శైలే. ఈ విషయంలో ఆయనకు ఆయనేసాటి. ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఈ విషయంలో ఆయన దరిదాపుల్లోకి రారంటే అతిశయోక్తి కాదు. భద్రతా వలయాన్ని దాటుకుని మరీ ప్రజల్లోకి వెళ్లగలిగే సత్తా ఆయనకుంది. అదే సమయంలో తన చుట్టూ ఏం జరుగుతుందో సునిశితంగా పరిశీలించే వ్యక్తి ఆయన. అదే ఇప్పుడు నలుగురు మీడియా ప్రతినిధులను ప్రాణాలు నిలిపింది.

ఈ ఘటన మంగళవారం గుజరాత్ లో చోటుచేసుకుంది. సౌరాష్ట్ర నర్మద అవతరణ్ ఇరిగేషన్ (సౌని) పథకం కింద ఆజి-3 డ్యామ్ ను మోదీ ప్రారంభించారు. డ్యామ్ స్విచ్ ఆన్ చేసిన అనంతరం నీటి విడుదలను ప్రధాని గమనిస్తున్నారు. ఈ సందర్భంలో నీరు వెళుతున్న దిగువ ప్రాంతంలో ఉండి ఫొటోలు తీస్తున్నముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియో చిత్రీకరిస్తున్న డీడీ చానెల్ కెమెరామన్ ని ఆయన గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన మోదీ, చప్పట్లు కొట్టి మరీ, వారిని అక్కడి నుంచి తప్పుకోమని చేతులూపి చెప్పారు. వెంటనే అధికారులకు తెలియజేశారు.



ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే కెమెరాను అక్కడే వదిలేసి ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం వారు ప్రధానిని కలిసి కృతజ్నత తెలియజేశారు. పదుల సంఖ్యలో అధికారులు అక్కడున్న ఒక్కరూ ఆ విషయాన్ని గమనించకపోవటం గమనార్హం. గతంతో విజ్నాన భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫోటో పడిపోతూ కిందపడిపోయిన ఫోటోగ్రాఫర్ కి స్వయంగా ఆయనే పైకి లేపటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Gujarat  Aji Dam  save  cameraman  photographers  

Other Articles