భారత్ బంద్ నేపథ్యంలో మోదీ అత్యవసర భేటీ | Modi calls meeting with ministres on Bharat Bandh.

Modi calls meeting with ministres on bharat bandh

Bharat Bandh o September 2nd, Modi Emergency meeting, Modi on Trade Unions Bandh, Modi Bharat Bandhm Bharat Bandh, Banks bandh

PM Modi Calls Emergency Meet with ministers over Banks, Factories to close on September 2nd on part of Bharat Bandh.

బంద్ భయంతో రంగంలోకి దిగిన మోదీ

Posted: 08/30/2016 10:15 AM IST
Modi calls meeting with ministres on bharat bandh

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న(శుక్రవారం) ట్రేడ్ యూనియన్లు, బ్యాంకులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెపై కేంద్ర ప్రభుత్వంలో కాస్త ఆందోళన నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసి తీరతామని, వెనక్కితగ్గది లేదని యూనియన్లు ప్రకటిస్తుండటంతో స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం కల్పించుకోనున్నారు. ఉన్నతాధికారులతో ఈ సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్న ప్రధాని, యూనియన్ నేతలకు ఎలాగైనా సర్దిచెప్పాలని అధికారులకు సూచించబోతున్నారని సమాచారం.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయుష్ గోయల్, బండారు దత్తాత్రేయ తదితర మంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, సమ్మెను విరమింపజేసే మార్గాలను అన్వేషించాలని ప్రధాని ఇప్పటికే అధికారులకు సూచించారు. కాగా, శుక్రవారం నాటి సమ్మెలో బ్యాంకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడనుండగా, వీరితో కలుస్తామని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్లు మాత్రం చెప్పలేదు. పలు రాష్ట్రాల యూనియన్లు మాత్రం సమ్మెకు మద్దతిస్తామని తెలిపాయి. ఏదేమైనా సామాన్యుడి జీవనం పై మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే ఈ బంద్ పై సాయంత్రం జరిగే చర్చల్లో ఏం జరగబోతుందోనని అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది.

గత ఏడాది సెప్టెంబర్ లో తమ నెలసరి కనీస వేతనాన్ని రూ. 9 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలన్న ప్రధాన డిమాండుతో సహా 12 డిమాండ్లతో యూనియన్లు సమ్మెకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను సైతం వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ బంద్ ను ఈసారి ఖచ్ఛితంగా చేసి తీరతామని యూనియన్లు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Bandh  Modi  Trade Unions  Emergency meeting  

Other Articles