ప్రియుడి ప్రాణం తీసిన మెడ ముద్దు | Mexican teen dies of a stroke after a HICKEY

Mexican teen dies of a stroke after a hickey

HICKEY death, Mexican teen dies of a stroke, Mexican teen dies after kiss, Mexican teen dies after neck kiss, neck kiss lover died, Neck Kiss causes Mexican teen death, Julio Macias Gonzalez died, Julio Macias Gonzalez lover

Mexican teen dies of a stroke after a 'HICKEY given by his 24-year-old girlfriend.

ముద్దు పేరుతో అక్కడ కొరికింది... ప్రాణాలు పోయాయి

Posted: 08/30/2016 11:24 AM IST
Mexican teen dies of a stroke after a hickey

ప్రియురాలు ప్రేమ‌తో ఆ ప్రియుడిని దగ్గరికి తీసుకుంది. ముద్దు పేరుతో చిలిపిగా అక్కడ కొరికింది. అంతే అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రేమతో ఆమె చేసిన సరసం అతని పాలిట యమపాశంగా మారింది. అదేంటి ముద్దుతో ప్రాణాలు ఎలా పోయీయి. అసలు ఆమె ఎక్కడ కొరికింది ఇప్పుడు తెలుసుకుందాం.

మెక్సికోకు చెందిన జులియో మేసియస్ గొంజాలెజ్ (17) అనే యువకుడు, తన కన్నా పెద్దది అయిన యువతి (24) తో ప్రేమలో ఉన్నాడు. గత వారం వీరిద్దరు కలిసి డిన్నర్ కు ఓ హోటల్ కు వెళ్లాడు. డిన్నర్ కు తీసుకువచ్చిన ప్రియుడిపై ప్రేమ ఉప్పొంగడంతో అతనిని దగ్గరకు తీసుకుని ప్రేమగా అతని మెడపై చిన్నగా కొరికింది. ప్రేమ పరిభాషలో దీనికి హిక్కీ అని పేరు. అయితే ఆ ప్రయత్నంలో ఏం జరిగిందో తెలీదు.  కానీ, వెంటనే కిందపడ్డ జులియో మేసియస్ మూర్ఛతో గిలగిల తన్నుకుని మృత్యువాతపడ్డాడు.

దీంతో ఆమె ఆందోళన చెందగా, హోటల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించింది. అయితే ప్రియురాలు అతని మెడ దగ్గర కొరకడం వల్ల బ్రెయిన్ కు రక్తం సరఫరా చేసే ఓ నరం కట్ అయి మెదడులో రక్తం గడ్డకట్టిందని, అందుకే గోంజాలెజ్ మరణించాడని వైద్యులు తేల్చారు. దీంతో తన ప్రేమ ఇంత పని చేసిందా అని నిట్టూర్చిన ఆమె అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. వయసులో పెద్దదని, ఆ యువతితో ప్రేమ వద్దని తమ కుమారుడిని వద్దని వారించిన వినలేదని ఆ యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డ ప్రాణాలు అతని ప్రియురాలే తీసిందని, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలింపు చేపట్టారు.

ప్రేమికుల మ‌ధ్య ముద్దు అనేది మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కానీ, ప్రేమతో ఇచ్చిన ముద్దు విషమై ప్రాణాలు తీయటం ప్చ్ శోచనీయం. గతంలో ఇంగ్లాండ్ లో ప్రియురాలికి అదరచుంబనం ఇవ్వటంతో ఊపిరిఆడక ఆమె చనిపోయిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Julio Macias Gonzalez  HICKEY  death  blood clot  

Other Articles